రామతీర్థం ఘటన.. జగన్ సంచలన నిర్ణయం

తీగ లాగితే పెద్ద పెద్ద తలకాయలు కనిపిస్తుండడంతో ఏపీ సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించారు. ఏపీలోని దేవాలయాలపై దాడులను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రామతీర్థంలో శ్రీరాముడి తలను నరికిన దుండగుల్లో టీడీపీ నేతలు ఉన్నారన్న ఆరోపణలు రావడంతో వెంటనే సీఐడీ విచారణకు ఆదేశిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. Also Read: అటు కేసీఆర్.. ఇటు జగన్ కు షాకిస్తున్న బండి సంజయ్ సీఎం జగన్ […]

Written By: NARESH, Updated On : January 5, 2021 11:53 am
Follow us on

తీగ లాగితే పెద్ద పెద్ద తలకాయలు కనిపిస్తుండడంతో ఏపీ సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించారు. ఏపీలోని దేవాలయాలపై దాడులను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రామతీర్థంలో శ్రీరాముడి తలను నరికిన దుండగుల్లో టీడీపీ నేతలు ఉన్నారన్న ఆరోపణలు రావడంతో వెంటనే సీఐడీ విచారణకు ఆదేశిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read: అటు కేసీఆర్.. ఇటు జగన్ కు షాకిస్తున్న బండి సంజయ్

సీఎం జగన్ ఆదేశాలతో దేవాదాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. రామతీర్థం ఘటనతోపాటు ఏపీలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రామతీర్థం ఘటనలో రెండు రోజుల్లో అరెస్టులు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేయడం విశేషం. ఇప్పటికే రామతీర్థం గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు ఇందులో కీలక పాత్రదారులని..వీరు టీడీపీ నేతలేనని గుర్తించారు. ఈ క్రమంలోనే దీనివెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొనడం రాజకీయంగా హీట్ పెంచింది.

ఇప్పటికే విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై ఉన్న శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కావడం ఏపీ సర్కార్ ను కార్నర్ చేసింది. అక్కడికి బీజేపీ నేతలు, స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్లి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా వేడి పెంచడంతోపాటు ఇతర వర్గాలు, సంఘాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి.

Also Read: ఏడోసారి చర్చలు.. ఇవైనా సక్సెస్‌ అయ్యేనా..?

ఈ కోవలోనే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు.. దాంతోపాటు ఈ విగ్రహ ధ్వంసంలో టీడీపీ నేతల పాత్రను నిగ్గు తేల్చేందుకు జగన్ సీఐడీ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఇందులో రెండురోజుల్లోనే కీలక నేతలను అరెస్ట్ చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్