https://oktelugu.com/

‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ ఎపిసోడ్-2.. వంటతో మంట పుట్టించారు!

oktelugu.com సమర్పణలో వస్తున్న ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న విడుదలైన ఎపిసోడ్-1 ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందగా.. దానికి కొనసాగింపుగా ఈ సాయంత్రం ఎపిసోడ్-2 విడుదలైంది. బిగ్ బాస్ హౌస్ ను పోలేలా ‘గుండు బాస్ హౌస్’ కాన్సెప్ట్ తో ఒక ఇంట్లో ఐదుగురు యువత చేసే అల్లరే మా ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కాన్సెప్ట్. అందులో పాత్రల ఇంట్రడక్షన్ వారి ఆటిట్యూడ్ కు జనాలు కనెక్ట్ అయ్యారు. ఒక రూంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2021 / 06:01 PM IST
    Follow us on

    oktelugu.com సమర్పణలో వస్తున్న ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న విడుదలైన ఎపిసోడ్-1 ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందగా.. దానికి కొనసాగింపుగా ఈ సాయంత్రం ఎపిసోడ్-2 విడుదలైంది.

    బిగ్ బాస్ హౌస్ ను పోలేలా ‘గుండు బాస్ హౌస్’ కాన్సెప్ట్ తో ఒక ఇంట్లో ఐదుగురు యువత చేసే అల్లరే మా ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కాన్సెప్ట్. అందులో పాత్రల ఇంట్రడక్షన్ వారి ఆటిట్యూడ్ కు జనాలు కనెక్ట్ అయ్యారు. ఒక రూంలో చేరిన ఐదుగురు భిన్న రకాల యూత్ కలిసి ఎలా ఆ రూంలో ప్రయాణం చేస్తారు? వారి కష్టనష్టాలు ఏంటి? వారి ప్రయాణం సాగుతుందా లేదా అన్నది రెండో ఎపిసోడ్ లో చూపించారు.

    ఇక ఒక రూంలో చేరిన వారు ఆదాయం సంపాదించుకునే మార్గాలను వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే ‘యూట్యూబ్ ’ ద్వారా వీడియోలు చేసి వైరల్ చేసి తద్వారా ఆదాయం పొందాలని స్కెచ్ గీస్తారు. అనుకుందే తడువుగా ‘వంటల ప్రోగ్రాం’లు చేయాలని డిసైడ్ అవుతారు. ఒక యువతి వంట ప్రజెంటర్ గా కాగా.. రెండో యువతి మేకప్ మెన్ గా వ్యవహరిస్తుంది. ఇక ముగ్గురు పురుషుల్లో ఒకరు దర్శకుడు, ఇంకొకరు కెమెరామెన్, మరొకరు రైటర్ గా చూపించుకుంటారు

    ఆ తర్వాత వంటల ప్రోగ్రాంలో తొలిసారి ‘అప్పడాలు’ ఎలా వండాలనేది చూపిస్తూ వీడియోలు చేస్తారు. ఈ వంటతోపాటు మంటపుట్టించే కామెడీ పంచ్ డైలాగులతో వీడియోలో అలరించారు. ఐదుగురు యువత మధ్య ఆకట్టుకునేలా సాగిన ఈ ఎపిసోడ్-2 ఆద్యంతం నవ్వులు పూయించింది. ప్రాస డైలాగులతో కామెడీని పంచారు. మొత్తానికి ఎలాగోలా వంటను పూర్తి చేసి కాగల కార్యాన్ని పూర్తి చేశారు. మూడో ఎపిసోడ్ కు రెడీగా ఉండాలని చివర్లో ట్విస్ట్ ఇచ్చారు.

    ‘రూమ్మేట్స్’ వెబ్ సిరీస్ కు కాన్సెప్ట్, దర్శకత్వాన్ని సాయి రాజేశ్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ క్రియేటివ్ హెడ్ గా సుందర్ ప్రపంచం వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ ఆకుమల్ల సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. నితిన్ కుమార్ సిరీస్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.. సంగీతాన్ని ‘అబు’ అందిస్తున్నాడు.. ‘oktelugu’ సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ఆదరించండి.. మా చానెల్ ను లైక్ చేయండి.. షేర్ చేయండి..

    మరి ఇంకెందుకు ఆలస్యం.. మా రెండో ఎపిసోడ్ ను కింద చూసేయండి..