పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలంటే..?

దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి విదితమే. గత నెల 31వ తేదీన పీఎఫ్ అకౌంట్ ఉన్నవారి ఖాతాలో వడ్డీ నగదు జమైంది. మొదట రెండు విడతల్లో వడ్డీని జమ చేయాలని భావించిన కేంద్రం ఆ తర్వాత ఒకే విడతలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర […]

Written By: Navya, Updated On : January 5, 2021 11:55 am
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి విదితమే. గత నెల 31వ తేదీన పీఎఫ్ అకౌంట్ ఉన్నవారి ఖాతాలో వడ్డీ నగదు జమైంది. మొదట రెండు విడతల్లో వడ్డీని జమ చేయాలని భావించిన కేంద్రం ఆ తర్వాత ఒకే విడతలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Also Read: డిప్లొమా పాసైన వాళ్లకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఇప్పటికే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారి ఖాతాలో వడ్డీ జమైంది. అయితే చాలామంది పీఎఫ్ ఖాతాదారులు వడ్డీని ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మొత్తం 4 ఆప్షన్ల ద్వారా పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ వడ్డీ జమైందో లేదో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. 011 – 22901406 నంబర్ కు పీఎఫ్ అకౌంట్ రిజిష్టర్ అయిన నంబర్ నుంచి కాల్ చేయడం ద్వారా సులభంగా పీఎఫ్ అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకే పరీక్ష.. కానీ..?

epfoho uan eng అని రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా కూడా సులభంగా బ్యాలన్స్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది. మెసేజ్ ద్వారా బ్యాలన్స్ ఈ విధంగా సులభంగా తెలుసుకోవచ్చు. యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ వివరాలు ఉన్నవాళ్లు పీఎఫ్ వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా సులభంగా పీఎఫ్ ఖాతా బ్యాలన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఉమాంగ్ యాప్ ను మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని కూడా సులభంగా పీఎఫ్ అకౌంట్ బ్యాలన్స్ ను తెలుసుకోవచ్చు. అయితే డిసెంబర్ 31వ తేదీన చెల్లించిన 8.5 శాతం వడ్డీ గత కొన్నేళ్లలో తక్కువ వడ్డీ కావడం గమనార్హం.