రఘురామ ఎంత పని చేస్తివి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కారణంగా కుటుంబాన్ని సైతం తెరపైకి తెచ్చారు. దీంతో వారు రఘురామ అరెస్టుపై మీడియా ముందుకు వస్తున్నారు. ఆయనకు ఏదైనా సీఎం జగన్ దే బాధ్యత అని చెబుతున్నారు. దీంతో రాష్ర్టంలో ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. నోరు అదుపులో.. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడానికి తాజా ఉదాహరణ రఘురామనే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే […]

Written By: Srinivas, Updated On : May 18, 2021 12:15 pm
Follow us on


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కారణంగా కుటుంబాన్ని సైతం తెరపైకి తెచ్చారు. దీంతో వారు రఘురామ అరెస్టుపై మీడియా ముందుకు వస్తున్నారు. ఆయనకు ఏదైనా సీఎం జగన్ దే బాధ్యత అని చెబుతున్నారు. దీంతో రాష్ర్టంలో ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

నోరు అదుపులో..
నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడానికి తాజా ఉదాహరణ రఘురామనే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కుందని భావించి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసి చిక్కుల్లో పడ్డారు. చివరికి కటాకటాల పాలయ్యారు. దీంతో ఆయన భార్య రమ, కొడుకు భరత్ సైతం కృష్ణం రాజుకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని చెప్పేస్తున్నారు. దీంతో రాష్ర్టంలో రాజకీయ వేడి రగులుతోంది.

కేవీపీతో సంబంధం వల్లే..
రఘురామ కృష్ణం రాజు కుటుంబం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. రఘురామ కుమార్తె వివాహం కేవీపీ రామచంద్ర రావు కుమారుడితో చేయడంతో రఘురామ కుటుంబం గురించి బయట తెలిసింది. ప్రస్తుతం ఆయన అరెస్టుతో రఘురామ కుటుంబం సైతం రోడ్డు మీదకు వచ్చింది. ఆయన అరెస్టుపై మాట్లాడుతూ అందరినీ కలుస్తున్నారు. రఘురామ విడుదల కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో పోస్టులు
రఘురామ వ్యవహారంపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉన్నా కుటుంబ సభ్యులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. విమర్శలు ఘాటుగా ఉంటే పరిస్థితి ఎలా తీవ్ర రూపం దాలుస్తుందో తెలుస్తుంది. రఘురామ నోరు అదుపులో పెట్టుకోవాలని చాలా మంది చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ ఉదంతంపై ఊహాగానాలు వస్తున్నాయి.

కుటుంబ సభ్యుల మనోవేదన
రఘురామ కృష్ణం రాజును చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య రమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై ఆందోళన చెందారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.