https://oktelugu.com/

లాక్ డౌన్ ఎఫెక్ట్: తగ్గిన సెకండ్ వేవ్

కరోనా దేశంలో తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది.రెండు మూడు రోజులుగా కేసులు మూడు లక్షలుగా నమోదు అవుతున్నాయి. అంతకుముందు రోజూ నాలుగు లక్షల కేసులు నమోదయ్యేవి. దీంతో కరోనా కాస్త శాంతించినట్లేనని చెబుతున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.81 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఆదివారం మూడు లక్షల లోపు కేసులు రావడం చూస్తే కరోనా సెకండ్ వేవ్ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ముందే చెప్పిన శాస్ర్తవేత్తలు కరోనా సెకండ్ వేవ్ మే రెండో వారంలో తగ్గుతుందని […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2021 2:01 pm
    Follow us on

    corona decreased
    కరోనా దేశంలో తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది.రెండు మూడు రోజులుగా కేసులు మూడు లక్షలుగా నమోదు అవుతున్నాయి. అంతకుముందు రోజూ నాలుగు లక్షల కేసులు నమోదయ్యేవి. దీంతో కరోనా కాస్త శాంతించినట్లేనని చెబుతున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.81 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఆదివారం మూడు లక్షల లోపు కేసులు రావడం చూస్తే కరోనా సెకండ్ వేవ్ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది.

    ముందే చెప్పిన శాస్ర్తవేత్తలు
    కరోనా సెకండ్ వేవ్ మే రెండో వారంలో తగ్గుతుందని వైరాలజిస్టులు ముందే చెప్పారు. ప్రస్తుతం జరుగుంది కూడా అదే. దీంతో కరోనా రోగులకు ఊరట లభించనుంది. అయితే మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. అదే స్థాయిలో రోజుకు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాధులు లేని వారికన్నా ఇతర రోగాలు ఉన్న వారికి కరోనా తొందరగా ప్రభావం చూపెడుతుంది.

    పెరుగుతున్న రికవరీలు
    దేశంలో రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షలకు చేరింది. అంతే వేగంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రికవరీ అవుతున్నాయి. దీంతో కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలకు ఊరట లభించనుంది. ఇన్నాళ్లు కేసుల భయంతో అల్లాడిన జనానికి ఇది తీపి కబురే. వేసవి ముందు నుంచి భయపెట్టిన కరోనా ప్రస్తుతం కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. రికవరీ రేటు పెరగడంతో బాధితులకు సైతం ధైర్యం కలుగుతోంది. కరోనా వస్తే మరణమే శరణ్యం అనుకునే వారికి ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది.

    జాగ్రత్తతోనే నివారణ
    కరోనా కట్టడికి జాగ్రత్తతోనే నివారణ సాధ్యం. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి నిత్యం చేస్తుండాలి. ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటే రోగం వచ్చే అవకాశం లేదు. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడమే మార్గం. లేకపోతే మనమే బాధ్యులం అవుతాం. కరోనా రక్కసిని రూపుమాపాలంటే ప్రభుత్వం చూపుతున్న మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాల్సిందే.