ఎంపీ బెయిల్ పై సుప్రీంలో వాదోపవానలు..

ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం ఎంపీ తరుపున, ప్రభుత్వం తరుపున నాయ్యవాదులు తమ వాదోపవాదనలు వినిపించారు. ఎంపీకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు అవకాశం ఇవ్వాలని, అలాగే ఆయన అరెస్టు తీరు, తదితర విషయాలను ఎంపీ తరుపున న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ కోరారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం తరుపున దుష్యంత్ దవే, వీవీ గిరిలు తమ వాదనలను వినిపించారు. ఎంపీకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సీఐడీ అవకాశం ఇవ్వలేదని, కిందిస్థాయి […]

Written By: NARESH, Updated On : May 17, 2021 12:39 pm
Follow us on

ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం ఎంపీ తరుపున, ప్రభుత్వం తరుపున నాయ్యవాదులు తమ వాదోపవాదనలు వినిపించారు. ఎంపీకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు అవకాశం ఇవ్వాలని, అలాగే ఆయన అరెస్టు తీరు, తదితర విషయాలను ఎంపీ తరుపున న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ కోరారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం తరుపున దుష్యంత్ దవే, వీవీ గిరిలు తమ వాదనలను వినిపించారు.

ఎంపీకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సీఐడీ అవకాశం ఇవ్వలేదని, కిందిస్థాయి కోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదని వివరించారు. కేవలం బెయిల్ రాకూడదనే సెక్షన్ 124 (ఏ)కింద నమోదు చేశారని చెప్పారు. ఎంపీపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని,అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని దాని ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. అంతేకాకుండా కస్టడీలో ఉన్న రఘురామకృష్ణం రాజును తీవ్రంగా కొట్టారని, అరికాళ్లకు తగిలిన దెబ్బలను మెజిస్ట్రేట్ కు చూపించారు.

అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ ఎంపీకి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలన్న వాదనపై అభ్యంతరాలు చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులతో చికిత్స చేస్తే అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ సందర్భంగా ఆర్మీ ఆసుపత్రి ఉందా.. అని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరుపున న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్లో ఉందన్నారు. ఏపీలో లేదా అని ప్రశ్నించగా సికింద్రాబాదోలోనే ఉందని అక్కడినుంచే నిందితుడిని అరెస్టు చేసుకొని తీసుకొచ్చారని అన్నారు.

అయితే తదుపరి విచారణను కాసేపటికి వాయిదా వేశారు. ఈ మధ్యలో మెయిల్ కు సంబంధిత పత్రాలను పంపించాలని న్యాయస్థానం సూచించింది.