https://oktelugu.com/

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ.. చంద్రబాబు మౌనం వెనక అంతర్యం ఏమిటీ..?

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రంలోని బీజేపీ నిర్ణయించినా ఏపీలో ఉలుకూ లేదు పలుకూ లేదు. కార్మికులు రోడ్డెక్కినా.. గొంతు చించుకున్నా పార్టీల స్పందన అందరినీ షాక్ కు గురిచేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం తెలిసినా పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు మిన్నకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం విషయంలో చిన్న ఇష్యూ జరిగినా.. పెద్దపెద్ద ఆందోళనలకు సిద్ధమయ్యే టీడీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో మౌనంగా ఎందుకు ఉంటున్నారనే అంశంపై సర్వత్రా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 / 10:33 PM IST
    Follow us on

    విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రంలోని బీజేపీ నిర్ణయించినా ఏపీలో ఉలుకూ లేదు పలుకూ లేదు. కార్మికులు రోడ్డెక్కినా.. గొంతు చించుకున్నా పార్టీల స్పందన అందరినీ షాక్ కు గురిచేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం తెలిసినా పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు మిన్నకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం విషయంలో చిన్న ఇష్యూ జరిగినా.. పెద్దపెద్ద ఆందోళనలకు సిద్ధమయ్యే టీడీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో మౌనంగా ఎందుకు ఉంటున్నారనే అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

    Also Read: సంచలనం: బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన జనసేన

    విశాఖ స్టీల్ ప్లాంటులో 100శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదలగాలని నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంటు మేనేజ్ మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ అఫైర్స్ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. విశాఖ ఉక్కు సంస్థలో 18వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20వేల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. దాదాపు 22వేల ఎకరాల విస్తీర్ణంలో విశాఖ ఉక్కు కర్మాగారం 2002నుంచి 2015 వరకు లాభాలు అర్జించింది. 2105నుంచి 2018 వరకు నష్టాలను చవిచూసింది.

    అయితే స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉపసంహరణపై శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. జీవీఎంసీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో ప్లాంటు కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంటు ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతిలు మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంటు కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.

    Also Read: నిమ్మగడ్డను చావుదెబ్బ తీసిన పెద్దిరెడ్డి..

    విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకునేందుకు విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని , స్టీల్ ప్లాంటు కోసం ఎటువంటి త్యాగానికి అయినా సిద్ధమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుకోసం 32మంది ప్రాణత్యాగం చేశారని.. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను లోక్ సభలో అడ్డుకుంటామని అన్నారు.

    శుక్రవారం స్టీల్ ప్లాంటుకోసం జరిగిన ఆందోళనలో అన్నిపార్టీలు పాల్గొనగా.. బీజేపీ, టీడీపీలు కనిపించలేదు. దీంతో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతిస్తున్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అమరావతి ఉద్యమం అంటూ .. గవర్నమెంటుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు.. ఏపీ మూడు రాజధానుల్లో ఒకటి అనుకుంటున్న విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్