ఇంగ్లండ్ తో టెస్ట్: విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తికి ప్రశంసలు

ఆస్ట్రేలియన్లు ఉడికిస్తారు.. జాత్యంహకార వ్యాఖ్యలు చేస్తారు.. స్టేడియంలో మన క్రికెటర్లపై నోరుపారేసుకుంటారు. కానీ ఇంగ్లండ్ జట్టు మాత్రం ఇలాంటి వివాదాలకు పోకుండా కేవలం ఆటమీదే దృష్టి సారించింది. పరుగుల వరద పారిస్తోంది. Also Read: ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ.. ఇండియాపై భారీ స్కోరు ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీకి దూసుకుపోతుండగా కాలికి తిమ్మిర్లతో ఇబ్బంది పడిపోతూ కింద పడిపోయాడు. దీంతో అక్కడే […]

Written By: NARESH, Updated On : February 6, 2021 5:07 pm
Follow us on

ఆస్ట్రేలియన్లు ఉడికిస్తారు.. జాత్యంహకార వ్యాఖ్యలు చేస్తారు.. స్టేడియంలో మన క్రికెటర్లపై నోరుపారేసుకుంటారు. కానీ ఇంగ్లండ్ జట్టు మాత్రం ఇలాంటి వివాదాలకు పోకుండా కేవలం ఆటమీదే దృష్టి సారించింది. పరుగుల వరద పారిస్తోంది.

Also Read: ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ.. ఇండియాపై భారీ స్కోరు

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీకి దూసుకుపోతుండగా కాలికి తిమ్మిర్లతో ఇబ్బంది పడిపోతూ కింద పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ క్రికెట్ మైదానంలో మరోసారి క్రీడా స్ఫూర్తిని చాటాడు. నేలపై పడుకున్న రూట్ కాళ్లను పైకిలేపాడు. బూట్ల వద్ద పట్టుకొని రూట్ ఇబ్బందిని తొలగించాడు. ఇది అభిమానులను ఫిదా చేసింది.

Also Read: ఇంగ్లండ్ బ్యాటింగ్ ఫస్ట్: భారత జట్టులో అనూహ్య మార్పులు.. షాకిచ్చిన కోహ్లీ

కోహ్లీ క్రీడా స్ఫూర్తిని బీసీసీఐ కొనియాడింది. ఆ వీడియోను ట్విట్టర్ లో షూర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో రూట్ 128 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

రూట్ తమ జట్టుపై సెంచరీ చేసి ఇబ్బంది పెట్టినా కూడా విరాట్ కోహ్లీ అతడు బాధ పడుతుంటే సాయం చేసిన తీరు చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల నుంచి సామాన్య నెటిజన్ల వరకు ప్రశంసిస్తున్నారు.

https://twitter.com/BCCI/status/1357650727460474880?s=20