https://oktelugu.com/

కేటీఆర్ సీఎం ఫిక్స్.. ఫిబ్రవరి 7న కేసీఆర్ ప్రకటన?

ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు. అంతేకాదు.. ఫిబ్రవరి 7న టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం.. ఈ రెండు తేదీలు దగ్గరగానే ఉన్నాయి. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘అధిశ్రావణయాగం’ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు 10వేల మందితో ఈ యాగాన్ని నిర్వహిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. లోక కళ్యాణం కోసం అని చెప్తున్నప్పటికీ కేసీఆర్ లెక్కలు వేరే ఉన్నాయని అంటున్నారు. కేటీఆర్ ను సీఎం చేయడానికే ఇదంతా కేసీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 / 09:17 PM IST
    Follow us on

    ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు. అంతేకాదు.. ఫిబ్రవరి 7న టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం.. ఈ రెండు తేదీలు దగ్గరగానే ఉన్నాయి. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘అధిశ్రావణయాగం’ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు 10వేల మందితో ఈ యాగాన్ని నిర్వహిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. లోక కళ్యాణం కోసం అని చెప్తున్నప్పటికీ కేసీఆర్ లెక్కలు వేరే ఉన్నాయని అంటున్నారు. కేటీఆర్ ను సీఎం చేయడానికే ఇదంతా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

    Also Read: ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?

    మునుపెన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 7న టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నామినేటెడ్ నేతలందరినీ ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే కేటీఆర్ ను సీఎంగా కేసీఆర్ ప్రకటించబోతున్నాడనే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.

    ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో పార్టీ సభ్యత్వాల పునరుద్దరణ, గ్రామస్థా యి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని పైకి చెబుతున్నా.. కేటీఆర్ ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందని.. కేసీఆర్ ప్రకటించబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి..

    Also Read: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌‌ ఫైర్‌‌..: బీజేపీ ప్లాన్‌ అదేనా..?

    కేటీఆర్ ను ఫిబ్రవరి 7న పార్టీ సమావేశంలో సీఎంగా ప్రకటించి.. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని.. కొడుకు కేటీఆర్ కు సీఎంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా యాగం చేయబోతున్నానడి ప్రచారం సాగుతోంది. దీన్ని బట్టి కేటీఆర్ పట్టాభిషేకానికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టే కనిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్