జైల్లో 48 మంది ఖైదీలను చంపేసిన ఖైదీ.. ఎందుకంటే..?

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే జైలుశిక్ష విధిస్తారు. ఆ ఖైదీని జైలులో పెట్టాలంటే మాత్రం పోలీసులే భయపడతారు. ఆ ఖైదీని ఏ జైలులో పెట్టినా ఆ జైలులో ఖైదీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 48 మంది ఖైదీలను దారుణంగా చంపేశాడు. ఆ వ్యక్తి తోటి ఖైదీలను హత్య చేయకుండా అధికారులు ఎన్నో చర్యలు చేపట్టారు. అయితే ఆ వ్యక్తి హత్యలు చేయకుండా మాత్రం ఆపలేకపోయారు. బ్రెజిల్ కు చెందిన […]

Written By: Kusuma Aggunna, Updated On : October 28, 2020 9:16 pm
Follow us on


సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే జైలుశిక్ష విధిస్తారు. ఆ ఖైదీని జైలులో పెట్టాలంటే మాత్రం పోలీసులే భయపడతారు. ఆ ఖైదీని ఏ జైలులో పెట్టినా ఆ జైలులో ఖైదీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 48 మంది ఖైదీలను దారుణంగా చంపేశాడు. ఆ వ్యక్తి తోటి ఖైదీలను హత్య చేయకుండా అధికారులు ఎన్నో చర్యలు చేపట్టారు. అయితే ఆ వ్యక్తి హత్యలు చేయకుండా మాత్రం ఆపలేకపోయారు. బ్రెజిల్ కు చెందిన ఆ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఆ ఖైదీ కొంతమందిని తల, మొండెం వేరు చేసి హత్య చేశాడంటే ఆ వ్యక్తి ఎంత క్రూరమైన వ్యక్తో సులభంగానే అర్థమవుతుంది. మార్కోస్ పౌలో దా సిల్వా అనే పిలవబడే వ్యక్తి వరుస హత్యల ద్వారా సీరియల్ కిల్లర్ గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. చిల్లర దొంగతనాలు చేసి యుక్త వయస్సులో పోలీసులకు దొరికిపోయిన జైలుకు వెళ్లిన తరువాత జైలులో హత్యలు చేయడం ప్రారంభించాడు.

లుసీఫర్ అని అందరూ పిలిచే ఆ ఖైదీ 1995 సంవత్సరంలో 18 ఏళ్ల వయస్సులో తొలిసారి జైలులో అడుగుపెట్టాడు. 2011లో బ్రెజిల్ లోని సావోపాలో జైలులో ఒకేసారి ఐదుగురు ఖైదీలను క్రూరంగా హత్య చేసి వార్తల్లో నిలిచాడు. 1995 నుంచి అతను చేస్తున్న హత్యల వల్ల జైలు శిక్ష అంతకంతకూ పెరుగుతోంది. తనకు వాళ్లను చంపినా పశ్చాత్తాపం లేదని వాళ్లు చేసిన నేరాలు నచ్చక హత్య చేశానని లుసీఫర్ చెప్పాడు.

అతను చెప్పిన మాటలు విని షాక్ అవ్వడం అధికారుల వంతయింది. జైళ్లు మార్చినా, కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినా అమాయకంగా ప్రవర్తించి లూసిఫర్ హత్యలు చేసేవాడు. లూసిఫర్ జైల్లో సొంతంగా కత్తి తయారు చేసుకుని హత్యలు చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్ సహాయంతో కూడా హత్యలు చేశాడు.