https://oktelugu.com/

వామ్మో.. నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు అన్ని రోజులా..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతంలోలా కాకుండా బ్యాంకుల టైమింగ్స్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అమలవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల సెలవులపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అలా లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నగదు లావాదేవీలు ఎక్కువగా చేసేవాళ్లు ఈ తరహా సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మరోవైపు నవంబర్ నెలలో ఎక్కువ పండుగలు ఉండటం కూడా సెలవుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం. నవంబర్ నెలలో రెండు శనివారాలు, రెండు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 28, 2020 / 08:30 PM IST
    Follow us on


    కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతంలోలా కాకుండా బ్యాంకుల టైమింగ్స్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అమలవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల సెలవులపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అలా లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నగదు లావాదేవీలు ఎక్కువగా చేసేవాళ్లు ఈ తరహా సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మరోవైపు నవంబర్ నెలలో ఎక్కువ పండుగలు ఉండటం కూడా సెలవుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం.

    నవంబర్ నెలలో రెండు శనివారాలు, రెండు ఆదివారాలు మొత్తం నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. హిందువుల పండుగలలో ముఖ్య పండుగ అయిన దీపావళి, గురునానక్ జయంతిలు ఉన్నాయి. కేంద్రం ప్రకటించే సెలవులు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి. శని, ఆదివారాలతో కలిపి మొత్తం ఎనిమిది రోజులు సెలవులు ఉన్నాయి.

    నవంబర్ 1వ తేదీన ఆదివారం, నవంబర్ 8వ తేదీ ఆదివారం, నవంబర్ 14వ తేదీ దీపావళి, రెండో శనివారం ఉనాయి. నవంబర్ 15, 22 తేదీలు ఆదివారం కావడంతో ఆ రోజులు సెలవు దినాలుగా ఉన్నాయి. నవంబర్ 28వ తేదీ నాలుగో శనివారం కాగా నవంబర్ 29వ తేదీ ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంది. నవంబర్ 30వ తేదీ గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ఉంది.

    సెలవులు ఎక్కువగా ఉండటంతో బ్యాంకు లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. సెలవు రోజుల్లో ఏటీఎలంలలో డబ్బు అందుబాటులో కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అందువల్ల అవసరాల మేరకు ముందుగానే విత్ డ్రా చేసుకుంటే మంచిది.