https://oktelugu.com/

తనది కాని చోట..! ఎంపీగా గెలిచినా తృప్తి లేని ‘కోమటిరెడ్డి’..!

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. నల్గొండ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ సీనియర్‌ నాయకుల్లో ఒకరై నిలుస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా పాల్గొంటూ అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికలోనూ పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్‌పై […]

Written By: , Updated On : October 29, 2020 / 08:15 AM IST
Follow us on

MP Komatireddy Venkat Reddy dissatisfied

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. నల్గొండ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ సీనియర్‌ నాయకుల్లో ఒకరై నిలుస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా పాల్గొంటూ అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికలోనూ పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్‌పై హెడ్‌సెట్‌ను విసిరి అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయబడ్డాడు. ఆ తరువాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోయినా భువనగిరి నుంచి ఎంపీగా గెలిచి పదవి దక్కించుకున్నాడు.

Also Read: దుబ్బాక విజేతను డిసైడ్ చేసేది మహిళలే!

తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ సమస్య వచ్చి పడింది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎన్నికైన వెంకటరెడ్డి ఇప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్నారు. అయితే ఆయనకు అచ్చొచ్చిన నల్గొండ నియోజకవర్గంలో ఎంపీగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో కోమటిరెడ్డి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి భయపడి తన సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి భయపడుతున్నాడట.

ఈ తరుణంలో కోమటిరెడ్డిని నమ్ముకొని ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారట. కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఆ పనో.. ఈ పనో.. చేయించుకునేవారట. అయితే వీరు ప్రస్తుత ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లడానికి సుముఖంగా లేరట. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఎంపీలైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటే కోమటిరెడ్డి అనుచరులు ఇష్టపడడం లేదు. దీంతో వాళ్లు ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఎంపీలున్నా కలిసేవాళ్లం గానీ.. ఉత్తమ్‌ దక్కరికి మాత్రం వెళ్లమంటే వెళ్లమంటున్నారు.

Also Read: రాములమ్మా.. చల్లబడమ్మా..!

సహజంగానే కాంగ్రెస్‌లో ఇద్దరు సీనియర్‌ నాయకులకు పడదు. పార్టీ అధికారంలో లేకపోయినా.. ఉన్నా.. స్టేటస్ ప్రభావం కలిసిమెలిసి ఉండనీయదు. అందుకే ప్రస్తుత టీకాంగ్రెస్‌ నాయకత్వ లేమితో బాధపడుతోంది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు కొనసాగడంతో కొందరు ఇమడలేక ఇతర పార్టీల దారి చూసుకున్నారు. మరి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం ఎన్నడు వచ్చేనో..? చూడాలి..