https://oktelugu.com/

ప్రభాస్ గిఫ్ట్: రాధేశ్యామ్ నుంచి సర్ ప్రైజింగ్ వీడియో

బాహుబలి సినిమా దెబ్బకు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇక వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా ప్యాన్ ఇండియా మూవీలే చేస్తున్నారు. బాహుబలి తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ చేశాడు. ఆ తర్వాత పూర్తి భిన్నంగా ‘రాధేశ్యామ్’ చేస్తున్నారు. Also Read: ఆర్ఆర్ఆర్: చివరి క్లైమాక్స్ ఫైట్ లో ఎన్టీఆర్, రాంచరణ్ ఇప్పుడు హృదయాన్ని తాకేలా తీర్చిదిద్దుతున్న ‘రాధేశ్యామ్’ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం […]

Written By: , Updated On : February 6, 2021 / 08:39 AM IST
Follow us on

Radhe Shyam pre teaser

బాహుబలి సినిమా దెబ్బకు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇక వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా ప్యాన్ ఇండియా మూవీలే చేస్తున్నారు. బాహుబలి తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ చేశాడు. ఆ తర్వాత పూర్తి భిన్నంగా ‘రాధేశ్యామ్’ చేస్తున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్: చివరి క్లైమాక్స్ ఫైట్ లో ఎన్టీఆర్, రాంచరణ్

ఇప్పుడు హృదయాన్ని తాకేలా తీర్చిదిద్దుతున్న ‘రాధేశ్యామ్’ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

ప్రభాస్ , పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పూర్వ జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్యగా.. పూజా ప్రేరణ అనే పాత్రల్లో నటిస్తోంది. ఇప్పటికే వీరి లుక్స్ విడుదల అయ్యాయి. టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఫ్యాన్స్ ప్రీ టీజర్ వీడియో రిలీజ్ చేసి ప్రభాష్ ఖుషీ చేశాడు.

Also Read: గోవాలో శ్రీముఖి రచ్చ: వాళ్లతో ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్

తాజాగా గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తోంది. ఈ వీడియోలో బాహుబలిగా.. సాహోలో క్లైమాక్స్ లో చూపించిన సీన్ ను మొదట జోడించారు. అవి రెండు యాక్షన్ గా ఉంటే ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో ప్రేమికుడిగా ప్రభాస్ ను చూపించారు. ఒక వీధిలో రోమాంటిక్ గా ప్రభాస్ నడుస్తున్న వీడియోను తాజాగా రిలజీ్ చేశారు. ఈ వీడియో చూస్తే టీజర్ మొత్తం ప్రేమ మైకంలో తేలిపోయేలా ఉంటుందని అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూశాక ఫిబ్రవరి 14న విడుదలయ్యే టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

*రాధేశ్యామ్ ప్రీ ట్రైలర్ ఇదే..

Pre Teaser of Radhe Shyam | Prabhas | Pooja Hegde | Radha Krishna Kumar | Glimpse on February 14th