అధికారంలో ఉండాలే గానీ.. ఉన్నదంతా మనదే.. అన్నట్లు దేశ రాజకీయాలు సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీదే రాజ్యం అన్నట్లుగా దేశం మొత్తం పాగా వేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇది దశాబ్దకాలంగా వస్తున్న సాంప్రదాయం..! తాజాగా దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఇదే పద్ధతిని పాటిస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి విశ్లేషణ చేసే సంస్థలు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 12 చోట్లో అధికారాన్ని చేపట్టిన బీజేపీ మరి కొన్ని చోట్ల ఆయా లోకల్ పార్టీల మద్ధతు కూడగట్టుకుంది. త్వరలో మరి కొన్ని చోట్ల జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ.. చంద్రబాబు మౌనం వెనక అంతర్యం ఏమిటీ..?
మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. కానీ అంతకుముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్కడి జనతాదళ్ కే అవకాశం ఇచ్చింది. దీంతో అధికారంలో ఎవరున్నా ఈ రాష్ట్రం బీజేపీ చెప్పుచేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక త్వరలో పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ పార్టీ సీనియర్ మంత్రి అమిత్ షా పర్యటించి హడావుడి చేశారు. ఈ హడావుడితో అధికారంలో ఉన్న టీఎంసీ మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది. బీజేపీ తన చాతుర్యతో అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడి పుట్టించింది. దీంతో టీఎంసీ నాయకులు ఒక్కొక్కరు కమలం గూటికి చేరుతున్నారు.
అలాగే గత 20 ఏళ్లుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో ఇక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ బీజేపీ జెండా ఎగురవేసేందుకు పార్టీ పెద్దలు వ్యూహరచణ చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి ప్రయత్నించినా.. సాధ్యం కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేందుకైనా యత్నిస్తోంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒడిశాలో అధికార పార్టీ బీజూ జనతాదళ్ 12 సీట్లు సాధించుకోగా , బీజేపీ 8 స్థానాల్లో జెండా ఎగురవేసి రెండో స్థానంలో నిలిచింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకడుగు ముందుకు వేయొచ్చని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
Also Read: కేటీఆర్ సీఎం ఫిక్స్.. ఫిబ్రవరి 7న కేసీఆర్ ప్రకటన..?
తదనంతరం తెలంగాణ, తమిళనాడుల్లోనూ బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ను వెనక్కి నెట్టివేసి బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుబ్బాక సీటును కైవలం చేసుకుంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. త్వరలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్