మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే తాను శాశ్వాతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సీఎం జగన్ కు సవాల్ విసిరారు. అమరావతిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఎండగట్టారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా? అని జగన్ సర్కార్ కు సవాల్ విసిరారు.
Also Read: చెడిపోయిన బుర్రలోంచి పుట్టిందే ‘అమరావతి’..!
అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన ‘అమరావతి జనభేరి’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి ఉద్యమం జరుగుతోందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వానికి రాజధాని మహిళల శాపం తగలక తప్పదని చంద్రబాబు అన్నారు. ఒక సామాజిక వర్గంలో పుట్టడం నా తప్పా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలనుకోవడం నా తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు జగన్ రెడ్డి.. నా దగ్గర నీ తెలివితేటలు పనిచేయవు అంటూ చంద్రబాబు ఉగ్రతాండవం చేశారు.
Also Read: ఏపీలో స్థానిక ఎన్నికలపై జగన్ సర్కార్ కు ఎస్ఈసీ ట్విస్ట్
అవసరమైతే ముద్దులు.. లేకుంటే పిడిగుద్దులు పెట్టడం జగన్ శైలి అని.. జగన్ వన్ టైం సీఎం అని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వన్ టైమేనని చంద్రబాబు అన్నారు. విశాఖ రాజధానిగా ప్రకటించారు. అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్