క్రేజ్ పీక్స్, రిజల్ట్ షాక్… అక్కడ నాని ‘వి’ఫలమే!

హీరో నానికి గత ఏడాది అంతగా కలిసి రాలేదు. ఆయన నటించిన గ్యాంగ్ లీడర్ నిరాశ పరచగా… పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జెర్సీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.నాని క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా కలిసొచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణపై ఆశలు పెట్టుకున్నాడు. ఇంద్రగంటి తనకు అత్యంత ఆప్తులైన నాని, సుధీర్ హీరోలుగా ‘వి’ అనే మల్టీస్టారర్ చేయడం జరిగింది. నాని సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ మూవీలో అతన్ని వేటాడే […]

Written By: admin, Updated On : December 17, 2020 6:03 pm
Follow us on


హీరో నానికి గత ఏడాది అంతగా కలిసి రాలేదు. ఆయన నటించిన గ్యాంగ్ లీడర్ నిరాశ పరచగా… పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జెర్సీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.నాని క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా కలిసొచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణపై ఆశలు పెట్టుకున్నాడు. ఇంద్రగంటి తనకు అత్యంత ఆప్తులైన నాని, సుధీర్ హీరోలుగా ‘వి’ అనే మల్టీస్టారర్ చేయడం జరిగింది. నాని సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ మూవీలో అతన్ని వేటాడే సీరియస్ పోలీస్ రోల్ చేశారు సుధీర్. ‘వి’ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సైకో కిల్లర్ గా నాని లుక్ అండ్ ఆటిట్యూడ్ కొత్తగా అనిపించాయి. నానికి ‘వి’ రూపంలో భారీ హిట్ దక్కడం ఖాయమని అందరూ భావించారు.

Also Read: హిరణ్య కశ్యపకు త్రివిక్రమ్ మాటలు.. ?

2019 ఉగాదికి విడుదల కావలసిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఓటిటి లో విడుదల చేయవలసి వచ్చింది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కి ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి ఇచ్చేశారు. విడుదల తరువాత ‘వి’ ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. ఎటువంటి కొత్తదనం లేని ‘వి’, ఒక రొటీన్ రివేంజ్ డ్రామాగా మిగిలిపోయింది. ప్రైమ్ లో అత్యదిక వ్యూస్ దక్కించుకున్న తెలుగు చిత్రంగా ‘వి’ నిలిచినప్పటికీ హిట్ టాక్ అయితే దక్కలేదు. కాగా బుల్లితెరపై కూడా వి మూవీ విఫలం చెందింది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమైన ఈ చిత్రం తక్కువ టీఆర్పీ నమోదు చేసింది.

Also Read: వారికీ 19, 20 ఏళ్ల వయసు భామలే కావాలి !

‘వి’ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టెలివిజన్ ప్రసారం చేయగా… కేవలం 6.8 టీఆర్పీ మాత్రమే రాబట్టింది. స్టార్ హీరోల సినిమాల టీఆర్పీతో ముడిపెట్టలేం కానీ, గత నాని చిత్రాలతో పోల్చుకున్నా కూడా ‘వి’ మూవీ టీఆర్పీ ఆమడ దూరంలో ఉంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న గ్యాంగ్ లీడర్ మూవీ 8.6 టీఆర్పీ తెచ్చుకుంది. అలాగే జెర్సీ చిత్రానికి అత్యధికంగా 8.8 టీఆర్పీ దక్కింది. అంతగా ఆకట్టుకోని దేవ్ దాస్ చిత్రం సైతం 8.3 టీఆర్పీ రాబట్టగా… ‘వి’ కేవలం 6.8 టీఆర్పీతో నిరాశపరిచింది. ఆ విధంగా బుల్లితెరపై కూడా ‘వి’ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇక ‘వి’ మూవీ ఫలితం ఎలా ఉన్నా నాని మాత్రం వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. ఇటీవలే మైత్రి మూవీస్ బ్యానర్ లో ‘అంటే సుందరానికి’ పేరుతో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈచిత్రానికి బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్