https://oktelugu.com/

నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. పంథా మార్చనున్న గులాబీ బాస్..!

తెలంగాణాలో గడిచిన ఆరేళ్లుగా ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ దే హవాగా కొనసాగింది. అసెంబ్లీ.. పార్లమెంట్.. మున్సిపల్.. కార్పొరేషన్.. పంచాయతీ.. సహకార.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్న కారు జెడ్ స్పీడుతో దూసుకెళ్లేది. Also Read: చంద్రబాబు సంచలనం: మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయ సన్యాసం ఇదంతా దుబ్బాక ఉప ఎన్నిక జరుగక ముందు సీన్.. ఎప్పుడైతే దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందో ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడింది. ఆ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 / 06:20 PM IST
    Follow us on

    తెలంగాణాలో గడిచిన ఆరేళ్లుగా ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ దే హవాగా కొనసాగింది. అసెంబ్లీ.. పార్లమెంట్.. మున్సిపల్.. కార్పొరేషన్.. పంచాయతీ.. సహకార.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్న కారు జెడ్ స్పీడుతో దూసుకెళ్లేది.

    Also Read: చంద్రబాబు సంచలనం: మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయ సన్యాసం

    ఇదంతా దుబ్బాక ఉప ఎన్నిక జరుగక ముందు సీన్.. ఎప్పుడైతే దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందో ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడింది. ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంలోనూ టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది.

    ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఇక త్వరలోనే నాగార్జున్ ఉపఎన్నిక జరుగనుండటంతో టీఆర్ఎస్.. బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి.

    టీఆర్ఎస్ నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో సత్తాచాటి తెలంగాణలో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ పక్కా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

    Also Read: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశం

    ఎన్నికల లోపు నాగార్జున్ సాగర్లో 100కోట్ల పనులు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ నేపథ్యంలో ఈసారి నోముల నర్సింహాయ్య కుటుంబానికి కాకుండా ఆ ప్రాంతంలోని బలమైన రెడ్డి వర్గానికి సీటు కేటాయించాలని భావిస్తున్నారని టాక్.

    కాంగ్రెస్ నుంచి జనారెడ్డి పోటీ చేయనని స్పష్టం చేశాడు. అయితే అతని కుమారుడి రఘువీర్ కు బీజేపీ.. టీఆర్ఎస్ లు గాలం వేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి రఘువీర్ పోటీ చేస్తారా? లేదా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

    రఘవీర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తే అతడికే టికెట్ కేటాయించేందుకు సీఎం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఆ ప్రాంతంలోని బలమైన రెడ్డి వర్గానికే సీటు కేటాయించే అవకాశం ఉందని టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్