శృంగార కార్యకలాపాలకు ఏపీలో ఇది అడ్డానట!

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. క్లబ్బులు, రిసార్ట్స్, బీచ్ లు కేంద్రాలుగా శృంగార కార్యకలాపాలు నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బీచ్ ల్లో సరదాగా ఆడుతూ పాడుతూ కాలం గడిపుతూ సమయం దొరికినప్పుడల్లా సరదాలు తీర్చుకోవడం పరిపాటిగా మారింది. దీంతో బీచ్ ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మంగినపూడి బీచ్ లో ఇలాంటి కార్యకలాపాలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయన తెలుస్తోంది. మంగినపూడి బీచ్ లో ఉన్న రిసార్టులు బిజీగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారు […]

Written By: Srinivas, Updated On : August 7, 2021 11:01 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. క్లబ్బులు, రిసార్ట్స్, బీచ్ లు కేంద్రాలుగా శృంగార కార్యకలాపాలు నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బీచ్ ల్లో సరదాగా ఆడుతూ పాడుతూ కాలం గడిపుతూ సమయం దొరికినప్పుడల్లా సరదాలు తీర్చుకోవడం పరిపాటిగా మారింది. దీంతో బీచ్ ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మంగినపూడి బీచ్ లో ఇలాంటి కార్యకలాపాలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయన తెలుస్తోంది.

మంగినపూడి బీచ్ లో ఉన్న రిసార్టులు బిజీగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారు కూడా రిసార్టులనే స్థావరాలుగా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై బందరు రూరల్ పోలీసులు రిసార్ట్స్ పై జరిపిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కారు. రిసార్టులు నడిపే వ్యక్తి మచిలీపట్నంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గదులను గంటల లెక్కన అద్దెకు ఇస్త సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గంటకు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ నిర్వాహకులు తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. రిసార్టుల నిర్వాకంపై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో కొన్ని జంటలు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇంకొందరు బాత్ రూముల్లో దాక్కున్నట్లు తెలిసింది. అందరు పారిపోగా మిగిలిన ఎనిమిది జంటలన పట్టుకుని వారి నుంచి సమాచారం సేకరించారు. వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి పంపించినట్లు సమాచారం.

పోలీసులకు చిక్కిన ఎనిమిది జంటలను మాత్రం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన కుటుంబాలను అక్కడి నుంచి పంపించారు. వారిలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారుగా గుర్తించారు. మొత్తానికి బీచ్ లు ఆహ్లాదాన్ని పంచే బదులు శృంగారం సైతం పంచుతున్నట్లు తెలుస్తోంది.