https://oktelugu.com/

రివ్యూ: ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మూవీ హిట్టా? ఫట్టా?

‘రాజావారు-రాణిగారు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన హీరో ‘కిరణ్ సబ్బవరం’. ఆ సినిమా సోసోగానే ఆడినా ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకున్నాడు. రెండో సినిమాగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చిత్రం తీశాడు. ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. శ్రీధర్ గాదె దర్శకత్వంలో ‘ప్రమోద్-రాజు’ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరోనాతో షూటింగ్ లేట్ అయినా పూర్తి చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? హిట్టాఫట్టా తెలుసుకుందాం. కథ: ‘ఎస్ఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2021 6:51 pm
    Follow us on

    SR Kalyanamandapam Telugu Movie Review

    ‘రాజావారు-రాణిగారు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన హీరో ‘కిరణ్ సబ్బవరం’. ఆ సినిమా సోసోగానే ఆడినా ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకున్నాడు. రెండో సినిమాగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చిత్రం తీశాడు. ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. శ్రీధర్ గాదె దర్శకత్వంలో ‘ప్రమోద్-రాజు’ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరోనాతో షూటింగ్ లేట్ అయినా పూర్తి చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? హిట్టాఫట్టా తెలుసుకుందాం.

    కథ:
    ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమా కథ మొత్తం ఆ కళ్యాణమండపం చుట్టే తిరుగుతుంది.. హీరో కిరణ్ తండ్రిగా సాయికుమార్ నటించాడు. ఆయన తన అసమర్థతతో కళ్యాణమండపాన్ని నిర్వహించలేక అప్పుల పాలవుతాడు.. చివరకు వారి కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు అయిన కళ్యాణమండపాన్ని కోల్పోయే దుస్థితికి వస్తాడు. తాగుడుకు బానిస అవుతాడు. దీన్ని తెలుసుకున్న తరువాత సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న హీరో కిరణ్ సొంతూరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఎలా నిలబెట్టాడు.? ఆదాయం తెచ్చాడు? అన్నది కథ. మధ్యలో హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ తో కాలేజీలో ప్రేమకథ. ఆమె గ్రామంలోని స్వయంగా విలన్ కూతురు కావడం.. ఇలా ట్విస్ట్ ఇచ్చారు.

    -విశ్లేషణ
    పాత రొట్టుకొట్టుడు కథలన్నీ ఏర్చి కూర్చి ఈ సినిమా కథ రాసినట్టు ఉంది. విశేషం ఏంటంటే దీన్ని హీరో కిరణ్ యే కథ, కథనం, మాటలు సమకూర్చడం విశేషం. సినిమా మొత్తం సాగే గొడవలు, అలకలు, కళ్యాన మండపం కోసం జరిగే ఫైట్లు, ఆధిపత్య పోరాటాలు చూపించారు. తండ్రి కళ్యాణ మండపాన్ని నిర్వహించడంలో వైఫల్యంతో కొడుకు ఎంట్రీ ఇచ్చి దాన్ని నిలబెట్టడం అన్నది సర్వసాధారణమైన కథ.. నటీనటులు కిరణ్, ప్రియాంక జువాల్కర్, సాయికుమార్, తులసీ, శ్రీకాంత్ అయ్యంగార్ లు బాగానేనటించారు.మూవీ మేకింగ్ వ్యాల్యూస్ అంతటా లేవు.

    -ప్లస్ పాయింట్స్
    ———–
    -నటీనటుల నటన
    -ఫైట్ సన్నివేశాలు
    -సంగీతం బాగుంది

    -మైనస్ పాయింట్లు
    ———–
    – ఆకట్టుకోని సెంటిమెంట్ సీన్లు
    -బలహీనమైన కథ, కథనం

    కథను మరింతగా ఆకట్టుకునేలా తయారు చేసి ఉంటే బాగుండేది. ప్లానింగ్ తో తీసి ఉంటే బెటర్ మూవీగా ఉండేది. సో ఈ సినిమా యావరేట్ అని ప్రేక్షకులు అంటున్నారు.

    oktelugu.com రేటింగ్: 2/5
    YouTube video player