పోలవరం: పునరావాసాన్ని గాలికొదిలేస్తున్న కేంద్రం, ఏపీ

ఏరు దాటాక తెప్ప తగలేస్తున్న చందంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఏపీ ఆ ఖర్చును భరించలేక నీళ్లొదిలేసింది. దీంతో జాతీయ ప్రాజెక్ట్ పోలవరం వెనుకలా ముంపునకు గురయ్యే తెలంగాణ, ఒడిషా ప్రజలు, గిరిజనులు నిండా మునిగి నిలువ నీడ లేకుండా చెల్లాచెదురు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. Also Read: టీడీపీ, వైసీపీ మోసాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు పోలవరం ముంపు బాధితుల పునరావాసంపై కేంద్రం తాజాగా చేతులెత్తేసింది. గోదావరిపై ఏపీలోని […]

Written By: NARESH, Updated On : October 26, 2020 4:17 pm
Follow us on

ఏరు దాటాక తెప్ప తగలేస్తున్న చందంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఏపీ ఆ ఖర్చును భరించలేక నీళ్లొదిలేసింది. దీంతో జాతీయ ప్రాజెక్ట్ పోలవరం వెనుకలా ముంపునకు గురయ్యే తెలంగాణ, ఒడిషా ప్రజలు, గిరిజనులు నిండా మునిగి నిలువ నీడ లేకుండా చెల్లాచెదురు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read: టీడీపీ, వైసీపీ మోసాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు

పోలవరం ముంపు బాధితుల పునరావాసంపై కేంద్రం తాజాగా చేతులెత్తేసింది. గోదావరిపై ఏపీలోని పోలవరంలో కడుతున్న ఈప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో.. ఒడిషాలోని గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతంలోని ప్రజలంతా ముంపునకు గురి అవుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే వేలాది మంది ఇళ్లను నీళ్లు కప్పేస్తాయి. పంట పొలాలు నీట మునుగుతాయి. వీరికి పునరావాసం కల్పించలేమని.. నిధులు ఇవ్వలేమని కేంద్రం తాజాగా చేతులు దులుపుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ, ఒడిషా ప్రజలు నిండా మునుగనున్నారు.

తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు చేసుకోగా.. అందులో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తి అయ్యింది? ఎంత ఖర్చు చేశారు? పునరావాసం సంగతి తెలియవచ్చింది.

సమాచార హక్కు చట్టం కింద పోలవరంపై ఒక ఆర్టీఐ కార్యకర్త సమాచారం కోరారు. ఇందులో 2016 నాటి కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం.. పునరావాసంతో సంబంధం లేకుండా కేవలం నిర్మాణ నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని ఆర్టీఐ ద్వారా స్పష్టమైంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి మొత్తం రూ.8814 కోట్లు విడుదల చేసిందని ఆర్టీఐ సమాచారంలో వెలుగుచూసింది. ఇప్పటివరకు కేవలం 20శాతం పునరావాసం మాత్రమే పూర్తయినట్టు తేలింది.

Also Read: రాజధానే లేదు.. విశాఖలో మెట్రో నిర్మిస్తారట..!

దీంతో పోలవరం ముంపు బాధితుల పునరావాసం తమకు సంబంధం లేదని ప్రాజెక్ట నిర్మాణానికే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే నిధులు లేమితో ఉన్న ఏపీ సర్కార్ కూడా పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించడం కష్టమే. సో పోలవరం ముంపు బాధితులు నిండా నీళ్లలో మునిగినట్టే..