https://oktelugu.com/

బిగ్ బాస్-4: దివి, దేవి ఎలిమినేషన్.. ఓటింగ్ పై అనుమానాలు..!

తెలుగు రియల్టీ షోలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ కొనసాగుతోంది. బిగ్ బాస్-1, 2, 3 సీజన్లకు భిన్నంగా ‘బిగ్ బాస్-4’ కొనసాగుతోంది. ఈ షోలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో తొలి మూడువారాలు షో చప్పగా సాగింది. ఆ తర్వాత బిగ్ బాస్ పంథా మార్చి ప్రేక్షకులను అలరించే టాస్కులు పెట్టడంతో క్రమంగా బిగ్ బాస్-4 పుంజుకుంది. Also Read: బిగ్ బాస్-4: మొనాల్ తో హైపర్ ఆది పులిహోర.. నవ్వకుండా ఉండలేరు? బిగ్ బాస్-4 నాలుగో […]

Written By: NARESH, Updated On : October 26, 2020 4:21 pm
Follow us on

Divi Elimination

తెలుగు రియల్టీ షోలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ కొనసాగుతోంది. బిగ్ బాస్-1, 2, 3 సీజన్లకు భిన్నంగా ‘బిగ్ బాస్-4’ కొనసాగుతోంది. ఈ షోలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో తొలి మూడువారాలు షో చప్పగా సాగింది. ఆ తర్వాత బిగ్ బాస్ పంథా మార్చి ప్రేక్షకులను అలరించే టాస్కులు పెట్టడంతో క్రమంగా బిగ్ బాస్-4 పుంజుకుంది.

Also Read: బిగ్ బాస్-4: మొనాల్ తో హైపర్ ఆది పులిహోర.. నవ్వకుండా ఉండలేరు?

బిగ్ బాస్-4 నాలుగో వారం నుంచి ప్రేక్షకులు బిగ్ బాస్-4 సీజన్ కు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ 50రోజులను పూర్తి చేసుకుంది. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ చూస్తుంటే బిగ్ బాస్ నిర్వాహాకులు ప్రేక్షకులు పంపించే ఓటింగ్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కేవలం స్క్రీప్టు ప్రకారంగానే బిగ్ బాస్ నుంచి కంటెస్టులు ఎలిమినేట్ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

హౌస్ లో నిజాయితీగా ఆడే కంటెస్టులను బయటికి పంపుతూ డ్రామాలు ఆడే కంటెస్టులకే బిగ్ బాస్ ప్రాధాన్యం ఇస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి క్రమంగా బలమైన కంటెస్టులు వెళ్లిపోతుండటం ఈ అనుమానాలు తావిస్తోంది. బిగ్ బాస్ కొందరినే హైలెట్ చేసి చూపిస్తూ మిగతా వారిని తక్కువ చూపిస్తున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

బిగ్ బాస్ ఎవరినైనా ఫోకస్ చేస్తున్నాడో వారే హౌస్ ఉంటారని.. మిగతావాళ్లు గేమ్ ఎంత మంచిగా ఆడినా వారిని బయటికి పంపుతున్నారనే టాక్ విన్పిస్తోంది. గతంలో ఎలిమినేషన్ అయిన కుమార్ సాయి.. దేవీ నాగవెల్లి ఎలిమినేషన్లలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బిగ్ బాస్ ప్రతీసారి మొనాల్ ను కాపాడుతూ మిగతా వారిని ఎలిమినేట్ చేస్తున్నాడనే టాక్ విన్పిస్తోంది.

తాజాగా దివి వద్యా ఎలిమినేషన్ తర్వాత ‘బిగ్ బాస్’పై నెటిజన్లు ఆగ్రహం మరింత కనిపించింది. ఇదొక చెత్త సీజన్ మరొకటి ఉండదని.. బిగ్‌బాస్ కోసం ఓటింగ్ చేయడం టైంవేస్ట్ అనే కామెంట్స్ చేస్తున్నారు. షో మొత్తం స్క్రీప్టు ప్రకారం సాగుతోందని రియల్టీగా జరగడంలేదని ఆరోపిస్తున్నారు.

Also Read: ‘బిగ్ బాస్’లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. కానీ..!

ఓటింగ్ ను బిగ్ బాస్ పట్టించుకోకుండా టీఆర్పీని పెంచుకునేలా ఎలిమినేషన్ చేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ‘బిగ్ బిస్-4’ రియల్టీ షో కాస్తా డ్రామా షోగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.