
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా మోదీ సర్కార్ దేశంలో అర్హత ఉన్న రైతులందరికీ మూడు విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తోంది. రైతులకు కేంద్రం జమ చేసిన సొమ్ము పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతోంది. గత రెండేళ్ల నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది.
అయితే దేశంలో ఎంతో మంది రైతులు అర్హత ఉన్నా తమ బ్యాంకు ఖాతాలలో నగదు జమ కావడం లేదని.. బ్యాంకు ఖాతాలలో నగదు జమ కాకపోవడానికి అసలు కారణం తమకు తెలియడం లేదని చెబుతున్నారు. అయితే కేంద్రం అర్హత ఉండి 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ల కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చి ఈ నంబర్ల ద్వారా ప్రయోజనం కలిగేలా చేస్తోంది.
ప్రస్తుతం దేశంలోని 11 కోట్లకు పైగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని సమాచారం. డబ్బులు జమ కాని రైతులు సమీపంలోని వ్యవసాయ శాఖాధికారికి ఫిర్యాదు చేసి పథకానికి అర్హత సాధించవచ్చు. 18001155266 టోల్ ఫ్రీ నంబర్, 155261 హెల్ప్ లైన్ నంబర్, 011 – 23381092, 23382401 ల్యాండ్ లైన్ నంబర్లకు కాల్ చేసి రైతులు సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ఈ నంబర్లు మాత్రమే కాక కేంద్రం 011 – 24300606, 0120 – 6025109 నంబర్ ను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ సమస్యల పరిష్కారం కోసం అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం రైతుల కోసం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒక్కటి. ఈ స్కీమ్ కు అర్హత పొందడం ద్వారా నగదుతో పాటు మరికొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు.