
రానురాను ఇంటి నుంచి బైక్ బయటికి తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులే వస్తున్నాయి. ఎందుకంటే.. రోజురోజుకూ మండిపోతున్న పెట్రోల్ ధరలు వాహనదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లీటరు పెట్రోల్ ధర రూ.90 దాటి సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 100 మార్కును కూడా దాటేశాయి. ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ ధరలు తొలిసారి వంద మార్క్ దాటి ఆల్ రికార్డ్ సృష్టించాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలు ధరల మోత మోగిస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read: ఏపీలోనే పెట్రోల్ ధరలు అధికం.. : ఎందుకో తెలుసా
మనదేశంలో రాజస్థాన్‌లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీగంగనార్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. సాధారణ పెట్రోల్ ధర రూ.98.40కి చేరింది. ప్రీమియం అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం. ప్రీమియం పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.89.10గా ఉండగా.. ముంబైలో రూ.95.61గా ఉంది. ప్రీమియం పెట్రోల్, సాధారణ పెట్రోల్ మధ్య ప్రధానమైన తేడా ఆక్టేన్ నెంబర్. సాధారణ పెట్రోల్‌కు ఆక్టేన్ నెంబర్ తక్కువగా ఉంటే, ప్రీమియం పెట్రోల్‌కు ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ నెంబర్ 91గా ఉంటుంది. ఇంధన యొక్క మండే నాణ్యత కొలతను ఆక్టేన్ నెంబర్‌గా పేర్కొంటారు.
Also Read: ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త నిబంధనలివే.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77గా ఉంది. ఇక డీజిల్ ధర రూ. 83.46గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 92.51 ఉంటే, డీజిల్ ధర రూ.85.70 పలుకుతోంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.91గా ఉంటే.. డీజిల్ ధర రూ.85.09గా ఉంది. మరోవైపు డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.76.23గా ఉంది. ముంబైలో ఇప్పటికే రూ.83 దాటింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగనార్ పట్టణంలో దాదాపు 90కి చేరింది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల తీరుపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.