https://oktelugu.com/

ఇదేం అరాచకం..: ఏపీ సర్కార్‌‌పై పవన్‌ ఫైర్‌‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతికి రావడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు సమాధానం దొరుకుతుందని జనసేనకులు ఆశతో ఉన్నారు. తిరుపతి చేరుకున్న పవన్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారని.. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని నిలదీశారు. Also Read: ఆ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 22, 2021 / 02:22 PM IST
    Follow us on


    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతికి రావడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు సమాధానం దొరుకుతుందని జనసేనకులు ఆశతో ఉన్నారు. తిరుపతి చేరుకున్న పవన్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారని.. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని నిలదీశారు.

    Also Read: ఆ ఏకగ్రీమాలను రద్దు చేసుడేనా..? : ఎస్‌ఈసీ అభిప్రాయం కూడా అదేనట

    ఇంకా ఏమన్నారంటే..‘హిందువుల పట్ల ఒకలా.. ఇతర మతాల పట్ల ఇంకోలా స్పందించడం తప్పు. అన్ని మతాల పట్ల సమానభావనే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండడమా..? ఏమాత్రం బాధ్యత లేకుండా వైకాపా సర్కారు వ్యవహరిస్తోంది. ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తామంటారా..? రాష్ట్రంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారు’ అంటూ నిలదీశారు.

    ‘దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. వాటిని కాపాడాలని కోరితే వారిపైనా కేసులు పెడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందన్న రీతిలో వైకాపా పాలన సాగుతోంది. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు.. పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారారు’ అని విమర్శించారు.

    Also Read: సంచలనం: కాపుల కోసం ముద్రగడ మరో కొత్త రాజకీయ పార్టీ

    మీడియాపైనా దాడులు పెరుగుతున్నాయని.. రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి తమకు క్షణం కూడా పట్టదని.. మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచి పద్ధతి కాదని.. ఈ అరాచకాలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఇందులో జనసేన పార్టీ ముందుంటుందని చెప్పారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్