https://oktelugu.com/

విశాఖ ఉక్కుపై అమిత్ షాతో పవన్ మంత్రాంగం.. మొర వింటారా?

ఏపీలో రగులుకున్న ఏపీ ఉద్యమాన్ని చల్లార్చేందుకు రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమిపై వ్యతిరేకతను తగ్గించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ తో మంగళవారం రాత్రి కీలక మంత్రాంగం జరిపారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. బీజేపీతో జనసేన రెండోసారి పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటి సారి అమిత్ షాతో పవన్ భేటి అయ్యారు. మోడీ తర్వాత దేశంలోనే నంబర్ 2 అయిన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2021 / 08:55 AM IST
    Follow us on

    ఏపీలో రగులుకున్న ఏపీ ఉద్యమాన్ని చల్లార్చేందుకు రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమిపై వ్యతిరేకతను తగ్గించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ తో మంగళవారం రాత్రి కీలక మంత్రాంగం జరిపారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు.

    బీజేపీతో జనసేన రెండోసారి పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటి సారి అమిత్ షాతో పవన్ భేటి అయ్యారు. మోడీ తర్వాత దేశంలోనే నంబర్ 2 అయిన అమిత్ షాను పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటిదాకా ఢిల్లీ వెళ్లిన పవన్ అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసివస్తున్నారు. ఈసారి మాత్రం విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణపైనే పవన్ ఈ భేటి నిర్వహించినట్టు సమాచారం.

    ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారం, ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపైనే వీరి భేటి జరిగినట్లు సమాచారం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయవద్దంటూ అమిత్ షాకు పవన్ లేఖ ఇచ్చారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. 32మంది ప్రాణ త్యాగ ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పాటైందని వివరించారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని పేర్కొన్నారు. కాబట్టి పరిశ్రమను ప్రైవేటుపరం చేయవద్దని కోరారు.

    ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు భావోద్వేగాలు చెలరేగాయి. ఇప్పటిదాకా ఏపీలో ప్రజా సమస్యలపై విస్తృతంగా తిరుగుతున్న బీజేపీ, జనసేనకు ఈ పరిణామం రాజకీయంగా దెబ్బపడుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సైతం విశాఖ ఉక్కు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న బీజేపీ-జనసేనకు దెబ్బపడకూడదంటే ఈ విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణను మానుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అమిత్ షాను కలిసినట్టు సమాచారం. మరి దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణకు బార్లా తెరిచిన మోడీషాలు కేవలం పవన్ చెప్పినంత మాత్రానా వెనకడుగు వేస్తారా? లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.