అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

ప్రస్తుతం మనలో చాలామంది ప్లాస్టిక్, స్టీల్, పింగాణీ, పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. అయితే పూర్వ కాలంలో మాత్రం భోజనం చేయడానికి ఎక్కువగా అరటి ఆకులనే వినియోగించేవారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆకలి పెరగడంతో పాటు కడుపులోని గ్యాస్ తగ్గుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో అరిటాకు సహాయపడుతుంది. పచ్చగా కనిపించే అరటి ఆకులో ఆహారం తింటే త్వరగా జీర్ణమవుతుంది. అరిటాకులో వేడి […]

Written By: Navya, Updated On : February 10, 2021 9:43 am
Follow us on

ప్రస్తుతం మనలో చాలామంది ప్లాస్టిక్, స్టీల్, పింగాణీ, పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. అయితే పూర్వ కాలంలో మాత్రం భోజనం చేయడానికి ఎక్కువగా అరటి ఆకులనే వినియోగించేవారు. అరిటాకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆకలి పెరగడంతో పాటు కడుపులోని గ్యాస్ తగ్గుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో అరిటాకు సహాయపడుతుంది.

పచ్చగా కనిపించే అరటి ఆకులో ఆహారం తింటే త్వరగా జీర్ణమవుతుంది. అరిటాకులో వేడి అన్నాన్ని వడ్డిస్తే ఆకులోని పోషకాలు శరీరంలోకి చేరతాయి. అరిటాకులో భోజనం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అరిటాకులో వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించుకొని తింటే కఫ, వాతాలు లాంటి సమస్యలు తగ్గడంతో పాటు ఎన్నో రకాల జబ్బులు దూరమవుతాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే శక్తి అరిటాకులో ఉంది.

అరిటాకులో ఆహారం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు ఉండవు. తెల్లని జుట్టు సమస్యతో బాధ పడేవాళ్లు రోజూ అరిటాకులో భోజనం చేస్తే జుట్టు త్వరగా నల్లబడుతుంది. అరిటాకులో విషాహారం పెడితే ఆ ఆకు నల్లగా మారిపోతుంది. అరిటాకుల్లో ఉండే ఫాలీఫినాల్స్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీ పవర్ ను అందజేస్తాయి.

అరటి ఆకుల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన స్థాయిలో పొటాషియం అందితే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.