
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి జట్టు పరంగానే కాదు.. అంతర్జాతీయ టెస్ట్ చాంపియన్ షిప్ పరంగానే భారీ దెబ్బ పడింది. ఇప్పటిదాకా టెస్ట్ చాంపియన్ షిప్ లో అందరికంటే టాప్ లో ఉన్న భారత్ ఇప్పుడు ఇంగ్లండ్ తో ఓటమితో 4వ స్థానానికి పడిపోయింది.
ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో టీమిండియా ర్యాంక్ ఒక్క ఓటమితో బాగా దిగజారింది. సునాయాసంగా ఫైనల్ కు చేరుకునే స్థాయి నుంచి కష్టపడితే కానీ చేరుకోలేని దుస్థితికి చేరింది. చాంపియన్ షిప్ లో ఇన్నాళ్లు ఫస్ట్ ప్లేసులో ఇండియా ఉండేది. సెకండ్ న్యూజిలాండ్ ఉంది. ఇప్పుడు ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది.ఇక ఇంగ్లండ్ 2వ స్థానానికి ఎగబాకింది.
న్యూజిలాండ్ ఇప్పటికే 70శాతం విజయాలతో ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. మరో స్థానం కోసం ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా పోటీపడుతున్నాయి.
ప్రస్తుం ఇండియాపై 3-1,3-0,4-0తో గెలిస్తే ఇంగ్లండ్ ఫైనల్ చేరుతుంది. అదే టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్ ను 2-1, లేదా 3-1తో సిరీస్ ను గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓటమితో కథ మొత్తం మారిపోయింది.
భారత్ ఇంగ్లండ్ సిరీస్ ఒకవేళ 1-0,2-1,2-0తో ఇంగ్లండ్ గెలిచినా కూడా ఇండియా ఇంటికి చేరి ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుతుంది. టెస్ట్ సిరీస్ డ్రా అయినా ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతుంది. దీంతో ఇండియాకు ఫైనల్ చేరడం కష్టంగా మారింది.