https://oktelugu.com/

టీజర్ టాక్: రీఎంట్రీలో ‘వకీల్ సాబ్’ అదరగొట్టేశాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిపోయారు. అక్కడ అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ పరాజయంతో రాజకీయాల్లో కొనసాగుతూనే మళ్లీ సినిమాల బాట పట్టారు. Also Read: అల్లుడు అదుర్స్ రివ్యూ : రెగ్యులర్ సినిమాల సమ్మేళనం ! రీఎంట్రీలో పవన్ తీస్తున్న మొదటి సినిమా ‘వకీల్ సాబ్’. పవన్ కళ్యాణ్ మాస్ పాత్ర పోషిస్తే కథ వేరేగుంటదనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘గబ్బర్ సింగ్’లో పోలీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2021 / 08:39 AM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిపోయారు. అక్కడ అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ పరాజయంతో రాజకీయాల్లో కొనసాగుతూనే మళ్లీ సినిమాల బాట పట్టారు.

    Also Read: అల్లుడు అదుర్స్ రివ్యూ : రెగ్యులర్ సినిమాల సమ్మేళనం !

    రీఎంట్రీలో పవన్ తీస్తున్న మొదటి సినిమా ‘వకీల్ సాబ్’. పవన్ కళ్యాణ్ మాస్ పాత్ర పోషిస్తే కథ వేరేగుంటదనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘గబ్బర్ సింగ్’లో పోలీస్ లా అలరించిన పవన్ ఇప్పుడు తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’లో మరోసారి మాస్ పాత్రలో అలరిస్తున్నారు.

    సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ ‘టీజర్’ను రిలీజ్ చేశారు. ఇది అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవర్ చూపించేలా టీజర్ ను తీర్చిదిద్దారని ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు.

    Also Read: వైరల్ : నిహారిక లవ్ యూ చెప్పింది భర్తకు కాదు..

    1.01 నిమిషాలు ఉన్న వకీల్ సాబ్ టీజర్ చూస్తే పవన్ కళ్యాణ్ స్టామినాను ప్రేక్షకులకు రుచిచూపించింది. ‘అబ్జక్షన్ యువర్ హానర్’ అంటూ బల్లగుద్ది వాయించే లాయర్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటి తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా డైలాగ్స్ పేల్చారు.

    భారీ అంచనాలతో రూపొందిన వకీల్ సాబ్ లో లాయర్ గా అసహాయ మహిళలకు సాయం చేసే న్యాయవాదిగా పవన్ వీరవిహారం చేసి అన్యాయాలను ఎదురించాడని అర్థమవుతోంది. కమ్ బ్యాచ్ టీజర్ మొత్తానికి అందరినీ అలరిస్తూ రికార్డులు సృష్టిస్తోంది..

    దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్