మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో చివరి రోజున కనుమగా జరుపుకుంటారు. ఈ కనుమ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం.ఎందుకంటే ఈ పండుగ రోజు కేవలం ఇష్టమైన ఆహారపదార్థాలను వండుకొని తినడం కనుమ స్పెషల్. ఈ కనుమ పండుగ రోజు కేవలం మనం మాత్రమే సంతోషంగా గడపడమే కాకుండా, మన సంతోషానికి కారణమైన ఆ పాడి పశువులను కూడా పూజించడం ఆనవాయితీ. మన సాంప్రదాయం ప్రకారం కనుమ నాడు మినుము తినాలనే ఓ సామెత ప్రాచుర్యంలో ఉంది. ఆ విధంగా కనుమ రోజు మినుము తినాడానికి గల కారణాలు ఏమిటో? మినుములు ఎందుకు తినాలో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: భోగి మంటలెందుకు? భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి? సంప్రదాయం వెనుక కథ
సాధారణంగా సంక్రాంతి పండుగకు సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం లోనికి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు మార్పులు చేర్పులు చేసుకుంటాయి. అందువల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలి నుంచి మన శరీరానికి వేడిని పొందాలంటే కనుమ రోజు మినుము తినాలని.ఈ మినుములలో శరీరానికి తగినంత వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి కనుమ రోజు మినుము తినాలని అనే సామెత ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. అందుకోసమే కనుమ రోజు మినుములతో తయారు చేసిన పిండి వంటలను తయారుచేసుకుంటారు.
Also Read: వ్యవసాయానికి ప్రతీకగా కనుమ పండుగ.. ఎందుకో తెలుసా..!
ఈ కనుమ రోజు అందరూ ఎక్కువగా మాంసాహారం తయారు చేసుకొని తింటారు. మాంసాహారం తిననీ వారికి అందులో ఉన్న పోషకాలతో సమానమైన మినుములతో తయారు చేసిన వంటలను పెడతారు. ఈ మినుములతో చేసిన వంటలు తినడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి వెంటనే అందజేస్తుంది. అంతేకాకుండా పూర్వ కాలం నుంచి ఈ కనుమ పండుగను పురస్కరించుకుని పితృదేవతలను గుర్తు చేసుకుంటారు. ఈ సందర్భంగా మినుములతో చేసిన గారెలను నైవేద్యంగా సమర్పించి భోజనం చేస్తారు. మినుముల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కనుమ రోజు మినుము తినాలనేది సామెతను వాడుతారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం