https://oktelugu.com/

సిగ్నల్ యాప్ కు మారుతున్నారా.. వాట్సాప్ గ్రూపులను ఎలా మార్చుకోవాలంటే..?

వాట్సాప్ యాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ఆ యాప్ కు కొత్త కష్టాలను తెస్తోంది. వాట్సాప్ ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి వివరణ ఇచ్చినా చాలామంది వాట్సాప్ యాప్ నుంచి మరో యాప్ కు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ప్రత్యామ్నాయంగా టెలీగ్రామ్ యాప్ పై ఆసక్తి చూపిస్తుంటే ఎక్కువమంది సిగ్నల్ యాప్ కు మారడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం గమనారహ్ం. Also Read: మతిమరుపుతో చిన్న తప్పు చేసిన అమెరికన్.. రూ.1753కోట్లు నష్టం..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2021 / 09:56 PM IST
    Follow us on


    వాట్సాప్ యాప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ఆ యాప్ కు కొత్త కష్టాలను తెస్తోంది. వాట్సాప్ ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి వివరణ ఇచ్చినా చాలామంది వాట్సాప్ యాప్ నుంచి మరో యాప్ కు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ప్రత్యామ్నాయంగా టెలీగ్రామ్ యాప్ పై ఆసక్తి చూపిస్తుంటే ఎక్కువమంది సిగ్నల్ యాప్ కు మారడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం గమనారహ్ం.

    Also Read: మతిమరుపుతో చిన్న తప్పు చేసిన అమెరికన్.. రూ.1753కోట్లు నష్టం..?

    అయితే సిగ్నల్ యాప్ యూజర్లకు కొత్త కావడంతో చాలామంది యూజర్లను అనేక సందేహాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలా సిగ్నల్ యాప్ లో గ్రూపులను క్రియేట్ చేసుకోవడం సాధ్యమవుతుందా…? లేదా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. వాట్సాప్ కు గట్టి పోటీ ఇచ్చే యాప్ గా సిగ్నల్ పేరు వినిపిస్తూ ఉండటంతో ఎక్కువమంది యూజర్లు ఈ యాప్ పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

    Also Read: నెలకు రూ.3,555 చెల్లిస్తే కొత్త కారు.. ఎలా అంటే..?

    ఎవరైతే వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనలకు అంగీకరించరో వారి మొబైల్ ఫోన్స్ లో వచ్చే నెల 8వ తేదీ నుంచి వాట్సాప్ పని చేయదు. సిగ్నల్ యాప్ ఒక కొత్త ఆప్షన్ సహాయంతో ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు సిగ్నల్ యాప్ లో జాయిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. సిగ్నల్ యాప్ లోకి వాట్సాప్ గ్రూపులోకి మార్చుకోవడానికి మొదట సిగ్నల్ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆ తరువాత గ్రూప్ సెట్టింగ్స్ లోకి వెళి గ్రూప్ లింక్ టర్న్ చేయాలి. ఆ తరువాత షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసి వాట్సాప్ గ్రూపులకు లింక్ లను షేర్ చేయాలి. ఆ ఇన్వైట్ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ యూజర్లు సులభంగా సిగ్నల్ గ్రూప్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రైవసీ పాలసీ ఇబ్బందులు తెస్తున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ పాలసీ విషయంలో వెనక్కు తగ్గుతుందేమో చూడాల్సి ఉంది.