హీరోయిన్ ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ !

మొత్తానికి హాట్ బ్యూటీ నికీషా పటేల్ కి పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపాడు. అయితే పవన్ విషెస్ వెనుక ఓ ఆసక్తికరమైన ట్వీట్ ఉంది. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హడావుడి గురించి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేయడంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. పవన్ పై కొంతమంది చేసిన బ్యాడ్ కామెంట్స్ కి కూడా పవన్ ఫ్యాన్స్ తమ […]

Written By: admin, Updated On : September 4, 2020 9:00 am
Follow us on


మొత్తానికి హాట్ బ్యూటీ నికీషా పటేల్ కి పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపాడు. అయితే పవన్ విషెస్ వెనుక ఓ ఆసక్తికరమైన ట్వీట్ ఉంది. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హడావుడి గురించి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేయడంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. పవన్ పై కొంతమంది చేసిన బ్యాడ్ కామెంట్స్ కి కూడా పవన్ ఫ్యాన్స్ తమ శైలిలో బదులిస్తూ రెచ్చిపోయారు. ఇక ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రముఖులు పోటీ పడ్డారు. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర సినీ పరిశ్రమల నుండి కూడా కొంతమంది హీరోహీరోయిన్లు పవన్‌కు తమ బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ క్రమంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో కొమురం పులిలో హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ నికీషా పటేల్ కూడా పవన్ ను విష్ చేస్తూ ట్వీట్ చేసింది. అయితే ఆమె తెలియజేసిన విషెస్ కాస్త ఆసక్తికరంగా ఉంది.

Also Read: ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?

తనను పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవట్లేదని ఈ హీరోయిన్ బాగా అలిగినట్టుగా ట్వీట్ చేసింది. ఈ అలక వెనుక గతేడాది చేదు సంఘటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నికీషా పటేల్ గతేడాది కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే అప్పుడు ఆమె తెలిసి తెలియక హ్యాష్ ట్యాగ్‌లో పవన్ కళ్యాణ్‌కు బదులు పావలా కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ ను పెట్టి విష్ చేసి.. పవన్ ఫ్యాన్స్ దృష్టిలో ఘోరమైన తప్పిదం చేసేసింది. దాంతో ఈ బ్యూటీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోశారు పవన్ ఫ్యాన్స్. దెబ్బకు ట్వీట్ డిలీట్ చేసి మళ్లీ సరైన హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది నికీషా పటేల్. అయినా నికీషాను మాత్రం పవన్ ఫ్యాన్స్ వదిలిపెట్టలేదు. ఆ తరువాత కొన్ని రోజులుపాటు బాగా ట్రోల్ చేశారు. ఫ్యాన్స్ తనని తిడుతున్నా పవన్ అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అనుకుని ఫీల్ అయిందో ఏమో గాని నికిషా పవన్ కి కాస్త ఫీల్ అయినట్టు ట్వీట్ చేసింది.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ.. మీరెప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మీ నుంచి మాత్రం నాకు ఎన్నడూ బర్త్ డే విషెస్ రాలేదు. రాకపోయినా సరే.. నేను మాత్రం ప్రతీ ఏడాది మీ బర్త్ డేకు ప్రత్యేకంగా విషెస్ చెబుతూ వస్తున్నాను. మీకు విషెస్ చెప్పడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక ఈ సంవత్సరం మాత్రం నేను సరైన హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించాను’ అంటూ నికీషా ట్వీట్ చేసింది. అయితే నికీషా ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ స్పందించాడు. పవన్ ట్వీట్ చేస్తూ.. ‘బర్త్ డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్.. నీకు అంతా మంచి జరగాలి అని పవన్ పోస్ట్ చేసాడు.