https://oktelugu.com/

సీఎం జగన్ కు పవన్ సూటి ప్రశ్నలు

జనసేనాని పవన్ కళ్యాన్ బయటకొచ్చాడు.. ట్విట్టర్ లో పవన్ సాగించిన ‘రామతీర్థం’ పోరాటం ముగియడంతో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు నేరుగా వచ్చారు. తుని నియోజకవర్గంలోని తొండగి మండలంలోని వలసపాకలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘దివిస్’ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడికి చేరుకొని భారీ బహిరంగ సభను నిర్వహించారు. Also Read: ‘పంచాయితీకి నై’.. హైకోర్టుకు జగన్ సర్కార్ ఈ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఓటు వేయకున్నా సైద్ధాంతిక బలంతోనే తాను నిలబడ్డానని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 / 08:51 PM IST
    Follow us on

    జనసేనాని పవన్ కళ్యాన్ బయటకొచ్చాడు.. ట్విట్టర్ లో పవన్ సాగించిన ‘రామతీర్థం’ పోరాటం ముగియడంతో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు నేరుగా వచ్చారు. తుని నియోజకవర్గంలోని తొండగి మండలంలోని వలసపాకలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘దివిస్’ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడికి చేరుకొని భారీ బహిరంగ సభను నిర్వహించారు.

    Also Read: ‘పంచాయితీకి నై’.. హైకోర్టుకు జగన్ సర్కార్

    ఈ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఓటు వేయకున్నా సైద్ధాంతిక బలంతోనే తాను నిలబడ్డానని.. తనకు ఆస్తులు, అధికారాలు అక్కర్లేదని.. ప్రజల కోసం పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కష్టపడి తల్లిదండ్రులు పిల్లలకు ఏమైనా ఇవ్వవచ్చని.. కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేరని.. ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే పరిశ్రమలు వద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని గుర్తు చేశారు.

    కాలుష్యం దృష్ట్యా దివిస్ పరిశ్రమ వద్దని గతంలో మీరే డిమాండ్ చేశారని.. అలాంటి పరిశ్రమకు అనుమతులు ఎలా ఇచ్చారని జగన్ ను ప్రశ్నించారు పవన్.

    Also Read: హిందూపురం వేదికగా బాలయ్య స్టేట్‌ పాలిటిక్స్‌

    వైసీపీ నాయకుల్లా తనకు తెలుగు చదువలేదు.. వందల కోట్ల డబ్బు, వందల ఎకరాల భూమిలిస్తే ఆరోగ్యాల పరిస్థితి ఏంటని పవన్ ప్రశ్నించారు.కాలుష్య జలాలను వదిలేస్తాం.. సముద్రంలోకి కలిపేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.

    దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఈరోజు గళమెత్తారు. అంతకుముందు రామతీర్థం విగ్రహాల ధ్వంసంపైనా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పవన్ ఈ మధ్య జోరు పెంచారనే చెప్పొచ్చు. మరి ఇది కొనసాగుతుందా? మరోసారి అమావాస్య చంద్రుడిలా మాయమైపోతాడా అన్నది వేచిచూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్