https://oktelugu.com/

ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..?

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్ మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఐఏఎఫ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎడ్యుకేష‌న్ ఇన్ ‌స్ట్రక్ట‌ర్ ట్రేడ్ మినహా గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలు, మ్యూజిషియ‌న్ ట్రేడ్, ఐఏఎఫ్‌ (ఎస్‌) మినహా గ్రూప్ వై ఉద్యోగాలు, మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ మినహా ఉన్న గ్రూప్ వై ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2021 / 08:52 PM IST
    Follow us on

    ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్ మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఐఏఎఫ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎడ్యుకేష‌న్ ఇన్ ‌స్ట్రక్ట‌ర్ ట్రేడ్ మినహా గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలు, మ్యూజిషియ‌న్ ట్రేడ్, ఐఏఎఫ్‌ (ఎస్‌) మినహా గ్రూప్ వై ఉద్యోగాలు, మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ మినహా ఉన్న గ్రూప్ వై ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    డిప్లొమా అభ్యర్థులు గ్రూప్ ఎక్స్ ట్రేడ్ పరీక్షలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇంటర్ అభ్యర్థులు గ్రూప్ ఎక్స్ తో పాటు గ్రూప్ వై పోస్టుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జనవరి 22వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 7 2021 సంవత్సరం దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది.

    https://indianairforce.nic.in/ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెడికల్ టెస్ట్, ఆన్ లైన్ టెస్ట్ లతో పాటు శరీర దారుఢ్య పరీక్ష కూడా ఉంటుంది. గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గంట సమయం పాటు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.

    గ్రూప్ వై పోస్టులకు 45 నిమిషాల సమయం ఉండగా జనరల్ అవేర్ నెస్, ఇంగ్లీష్ రీజనింగ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. రెండు ట్రేడ్ లకు పరీక్షలు రాసే అభ్యర్థులకు 85 నిమిషాల సమయం ఉంటుంది. https://indianairforce.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.