https://oktelugu.com/

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఇంటర్నెట్ లేకపోయినా..?

దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తూ వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. అయితే త్వరలో వాట్సాప్ యూజర్లకు మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ అందుబాటులోకి రానుందని ఈ ఫీచర్ సహాయంతో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్ లలో వాట్సాప్ ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2021 / 08:03 PM IST
    Follow us on


    దేశంలో కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తూ వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. అయితే త్వరలో వాట్సాప్ యూజర్లకు మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ అందుబాటులోకి రానుందని ఈ ఫీచర్ సహాయంతో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్ లలో వాట్సాప్ ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది.

    ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ వెబ్ వెర్షన్ లో ఇంటర్నెట్ లేకపోయినా వెబ్ సెషన్ ఆగిపోదని సమాచారం. ప్రస్తుతం వాట్సాప్ మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ ఆగిపోతే వెబ్ సెషన్ లో కూడా ఆగిపోతూ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోన్ లో ఇంటర్నెట్ పని చేయకపోయినా వాట్సాప్ వెబ్ ను వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది.

    వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్న బీటా వెర్షన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా భవిష్యత్తులో మిగిలిన యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఏ ఫోన్లో మొదట్లో వాట్సాప్ ను ఓపెన్ చేసారో ఆ ఫోన్ లోనే కొన్ని ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ను వినియోగించే ఇతర డివైజ్ లలో కొన్ని ఫీచర్లను వినియోగించుకోవడం సాధ్యం కాదు.

    wabetainfo తెలిపిన వివరాల ప్రకారం ఒక వాట్సాప్ ను నాలుగు డివైజ్ లలో వినియోగించే అవకాశం ఉంటుంది. వాట్సాప్ లింక్ చేసిన డివైజ్ లలో చాట్ హిస్టరీ కనెక్ట్ చేసుకునే డివైజ్ లలోకి ఆటోమేటిక్ గా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.