ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇండియాలో సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కోవిడ్ వైరస్ అటు ఆరోగ్యపరంగానూ.. ఇటు ఆర్థికంగానూ దెబ్బతీసింది. ఒకే కుటుంబంలో ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు.. అంటూ బలైపోవడంతో బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయి. పొలమో, ఇల్లో, బంగారమో అమ్మేసి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని కుటుంబాలు చూస్తే.. కార్పొరేట్ ఆస్పత్రులు నిలువునా దోచుకున్నాయి. లక్షలు కుమ్మరించినా చివరకు డెడ్ బాడీలే ఇచ్చాయి. ‘దేవుడా.. ఎందుకయ్యా మాకు ఇలాంటి దుస్థితి కల్పించావు’ అంటూ గుండెలవిసేలా ఏడ్చారు. అంతేకాదు.. రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు బలైన వారూ ఉన్నారు. కుటుంబ పెద్దలను బలిగొన్న వైరస్.. చాలా చోట్ల పిల్లలను అనాథల్ని చేసింది. అదే సమయంలో ఎంతో మంది ఉపాధిని దెబ్బతీసింది.
Also Read: వైఎస్సార్ సీపీకి టీడీపీ బంపరాఫర్.. ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేయండి.. పోటీపెట్టం
గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు దేశంలో 10,000కి పైగా కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధాలు ఏర్పడటం ఇందుకు కారణమైందని పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద లభ్యమవుతున్న తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్ 248(2) కింద మొత్తం 10,113 కంపెనీలను మూసివేశారు.
ఎలాంటి చట్టపరమైన చర్యల వల్ల కాకుండా.. స్వచ్ఛందంగానే వ్యాపారాలను కంపెనీలు ఆపేశాయనే విషయాన్ని సెక్షన్ 248(2) తెలియజేస్తోంది. అత్యధికంగా దిల్లీలో 2,394 కంపెనీలు మూతపడగా.. ఉత్తరప్రదేశ్ (1,936 కంపెనీలు) ఆ తర్వాతి స్థానంలో ఉంది. తమిళనాడులో 1,322, మహారాష్ట్రలో 1,279, కర్ణాటకలో 836, చండీగఢ్‌లో 501, రాజస్థాన్‌లో 479, తెలంగాణలో 404, కేరళలో 307, ఝార్ఖండ్‌లో 137, మధ్యప్రదేశ్‌లో 111, బిహార్‌లో 104 కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు.
Also Read: విశాఖ ఉక్కు పాపం.. బీజేపీ వైపు నెట్టిన జగన్
2020–-21లో వ్యాపారాలను ఆపేసిన నమోదిత కంపెనీల వివరాలను తెలియజేయాల్సిందిగా పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై వివరాలను తెలియజేశారు. అంటే ఈ లెక్కల ప్రకారం ఇలానే అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఎంత మంది ఉపాధి కోల్పోయారో..? మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్