Omricon: గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మరి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మరి ధాటికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది రోడ్డున పడ్డారు. ఈ సమయంలో సైంటిస్టులు కృషి ఫలితంగా కోవిడ్-19కు టీకా, మందులు రావడంతో మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ భయానక పరిస్థితుల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయితే మరో మహమ్మరి ప్రపంచానికి పెను సవాల్ విసురుతుండటం ఆందోళనను రేపుతోంది.
వైరస్ నిత్యం రూపాంతరం చెందుతూ తన ప్రభావాన్ని చివరకు కోల్పోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే కరోనా వైరస్ కూడా రూపాంతరం చెందుతూ కొత్త కొత్త వేరింట్లను పుట్టిస్తోంది. వీటిలో కొన్ని వేరింట్లు డేంజర్ గా మారుతుండగా మరికొన్ని వేరింట్లతో ప్రమాదం లేదని తెలుస్తోంది. అప్పట్లో డెల్టా వేరింట్ సృష్టించిన బీభత్సం గురించి అందరూ వినే ఉంటారు. డెల్టా వేరింట్ చాలా వేగంగా మ్యూటేషన్ అవుతూ ప్రాణాంతకంగా మారడం అందరినీ కలవరానికి గురిచేసింది.
తాజాగా ఇలాంటి మహ్మమరి తెరపైకి వచ్చింది. డెల్టాను తలదన్నేలా ‘ఒమ్రికాన్’ వైరస్ విజృంభిస్తోంది. బి1.1.529 గా పేర్కొనబడిన ఈ వేరియంట్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి పొరుగు దేశాలకు పాకుతోంది. ఈ వైరస్ కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారిపై సైతం వదలడం లేదని తెలుస్తోంది. డెల్టా కంటే ఒమ్రికాన్ చాలా శక్తివంతంగా ఉండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి.
Also Read: ప్రజలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్!
వేగంగా వ్యాపించడం.. తీవ్ర కరోనా లక్షణాలతో విరుచుకుపడటం ఒమ్రికాన్ ప్రత్యేకగా నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణాఫ్రికా, పొరుగుదేశాల్లో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. దీని దెబ్బకు ఐరోపా, ఆసియా దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ముడిచమురు ధరలు ఏడు శాతం తగ్గగా ఎయిర్ లైన్స్ షేర్లు భారీగా దెబ్బతింటున్నాయి. ఒమ్రికాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వచ్చే విదేశీయులపై ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇక భారత్ లో ఈ వేరియంట్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య వెల్లడించింది. కొత్త వేరియంట్ పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న్ నేపథ్యంలో కేంద్రం సైతం దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. ఒమ్రికాన్ కు వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే శక్తి సామర్థ్యాలు ఉండటంతో భారత్ దీనిపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తుందనేది మాత్రం ఉత్కంఠతను రేపుతోంది.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!