Bimbisara: బింబిసార టీజర్​ రిలీజ్​ ఎప్పుడంటే?

Bimbisara: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి నందమూరి కళ్యాణ్​ రామ్​. హిట్లు, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్​. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సరికొత్త కథలున్న చిత్రాలనూ ఎంచుకుని తనలోని నటనకు పదును పెడుతున్నారు. కాగా, కళ్యాణ్​రామ్​ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్​ సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా […]

Written By: Raghava Rao Gara, Updated On : November 27, 2021 1:17 pm
Follow us on

Bimbisara: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి నందమూరి కళ్యాణ్​ రామ్​. హిట్లు, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్​. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సరికొత్త కథలున్న చిత్రాలనూ ఎంచుకుని తనలోని నటనకు పదును పెడుతున్నారు.

Kalyan Ram’s Bimbisara

కాగా, కళ్యాణ్​రామ్​ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్​ సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్​ను సైలెంట్​గా ముగించుకుని.. థియేటర్లలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా, బింబిసార టీజర్​ గురించి అప్​డేట్ ఇచ్చారు మేకర్స్​. ఈ సినిమా టీజర్​ను ఈ నెల29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, డిసెంబరు రేసులోనే ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్​. దీంతో నందమూరి అభిమానులు బింబిసార సినిమా టీజర్​కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: హీరో రాజశేఖర్ ఆ మూవీలు చేసి ఉంటేనా?

ఈ సినిమాకు మల్లిడి వశిస్ట్​ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే తెలుగు పరిశ్రమకు నూతన దర్శకుడిగా పరిచయం కానున్నారు వశిస్ట్​. ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్​గా కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.  ఇటీవలే పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తించాయి.

Also Read: ఎన్టీఆర్ తో గేమ్.. ఇంతకీ మహేష్ ఎంత గెలుచుకున్నాడంటే?