https://oktelugu.com/

దోస్తీకి చెక్: జగన్ తో ఫైట్ కు ఓవైసీ రెడీ? కారణమదే!

రాజకీయాల్లో మిత్రులు.. శత్రువులు ఎవరూ శాశ్వతం కాదు. అలాగే.. నేటి మిత్రుడే రేపటి రాజకీయ శత్రువు కావచ్చు.. నిన్నటి శత్రువే ఒకానొక సందర్భంలో మిత్రుడు అవ్వొచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీలో రాజకీయాల్లో కనిపిస్తోంది. బీహార్‌‌ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. అస‌లు ఏపీతో సంబంధం లేని ఈ ఎన్నిక‌ల‌పై ఇక్కడ ఏపీలో వైసీపీ త‌ర్జనభర్జన ప‌డుతోంది. Also Read: ఏపీకి కొత్త సీఎం.. ‘ఆర్ఆర్ఆర్’ సంచలన కామెంట్స్..! జగన్‌ రందీ పడుతోంది బీజేపీ విషయంలో కాదు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 8:05 pm
    Follow us on

    Owaisi Jagan

    రాజకీయాల్లో మిత్రులు.. శత్రువులు ఎవరూ శాశ్వతం కాదు. అలాగే.. నేటి మిత్రుడే రేపటి రాజకీయ శత్రువు కావచ్చు.. నిన్నటి శత్రువే ఒకానొక సందర్భంలో మిత్రుడు అవ్వొచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీలో రాజకీయాల్లో కనిపిస్తోంది. బీహార్‌‌ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. అస‌లు ఏపీతో సంబంధం లేని ఈ ఎన్నిక‌ల‌పై ఇక్కడ ఏపీలో వైసీపీ త‌ర్జనభర్జన ప‌డుతోంది.

    Also Read: ఏపీకి కొత్త సీఎం.. ‘ఆర్ఆర్ఆర్’ సంచలన కామెంట్స్..!

    జగన్‌ రందీ పడుతోంది బీజేపీ విషయంలో కాదు.. జగన్‌కు మిత్రుడిగా ఉన్న మరోపార్టీ అధినేత అంట. ఆయనే మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ. హైద‌రాబాద్ వేదిక‌గా రాజ‌కీయాలు చేస్తున్న ఎంఐఎం.. బీహార్‌లో ఐదు చోట్ల విజ‌యం సాధించింది. అయితే.. ఇప్పటి వ‌ర‌కు బీజేపీ కేంద్రంగా ఉత్తరాదిలో పోటీ చేసిన ఎంఐఎం.. ఇప్పుడు సొంతంగా ఎందుకు దూకుడు చూపించ‌కూడ‌ద‌నే ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీపైనా దృష్టి పెట్టాల‌ని భావిస్తున్నట్టు హైద‌రాబాద్‌లోని ఎంఐఎం వ‌ర్గాలు చెబుతున్నాయి.

    నిజానికి ఏపీలో పార్టీల మీద ముస్లింలకు అసంతృప్తి అయితే ఉంది. తమను ఏ పార్టీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వారిలో ఉంది. అందుకే తమకంటూ ఓ ప్రత్యేక వేదిక ఉండాలని చూస్తున్నారట. గతంలో టీడీపీ హయాంలో అయితే ముస్లింలు ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అంజాద్‌బాషా ఉన్నా.. ఆయనకు ఇండిపెండెన్సీ లేదు. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నార‌నేది వాస్తవం. ఇక‌.. మైనారిటీ ముస్లింల‌కు దిక్సూచిగా ఉన్న ఎంఐఎం.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఏపీపై దృష్టి పెట్టింది. అయితే.. జ‌గ‌న్‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాలు, కేసీఆర్‌తో ఉన్న దోస్తీ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు అడ్డుప‌డ‌కుండా సంయ‌మ‌నం పాటించారు.

    Also Read: కొత్త జిల్లాలు.. ఏపీలో పెనుమార్పులు ఇవీ!

    అయితే.. ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుందట. తమ్ముడు.. తమ్ముడు.. పేకాట.. పేకాటే అన్నట్లు ఆ రాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీపైనా దృష్టి పెట్టింది. దాదాపు 15 నియోజ‌క‌వ‌ర్గాలు ముస్లిం మైనారిటీ బ‌లంగా ఉన్న స్థానాలు కావ‌డంతో అక్కడ పోటీ చేసే అవ‌కాశం మెండుగా ఉంది. ఇది జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికలు జగన్‌కు అంత ఈజీ మాత్రం కదనేది అర్థమవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్