రోజుకు 4 గంటలు పని చేస్తే రూ.70 వేల ఆదాయం.. ఎలా అంటే..?

మనలో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. అయితే తెలివిగా కష్టపడితే మాత్రమే సులభంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ కంపె నీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అమెజాన్ నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అమెజాన్ లో ఉద్యోగాల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే అమెజాన్ లో ఉద్యోగం ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. రోజురోజుకు అమెజాన్ లో […]

Written By: Navya, Updated On : November 15, 2020 6:44 pm
Follow us on


మనలో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. అయితే తెలివిగా కష్టపడితే మాత్రమే సులభంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ కంపె నీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అమెజాన్ నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అమెజాన్ లో ఉద్యోగాల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మిగతా ఉద్యోగాలతో పోలిస్తే అమెజాన్ లో ఉద్యోగం ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. రోజురోజుకు అమెజాన్ లో షాపింగ్ చేసే వాళ్ల సంఖ్య పెరగడంతో అమెజాన్ సంస్థ పెద్దఎత్తున డెలివరీ బాయ్ లను నియమించుకుంటోంది. రోజుకు 4 నుంచి 6 గంటలు పని చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందగలిగే ఛాన్స్ ఉంటుంది. చాలా పట్టణాల్లో అమెజాన్ సంస్థకు డెలివరీ సెంటర్లు ఉన్నాయి.

ఆసక్తి ఉన్న వాళ్లు డెలివరీ సెంటర్ కు వెళ్లి డెలివరీ బాయ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డెలివరీ సెంటర్ల గురించి సరైన అవగాహన లేని వాళ్లు https://logistics.amazon.in/app/download-app ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెజాన్ సంస్థలో పార్ట్ టైమ్ పని చేసినా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సులువుగా పొందవచ్చు. నాలుగు గంటల సమయంలో సులువుగా 70 నుంచి 100 ప్రాడక్ట్ లను డెలివరీ చేయవచ్చు.

అయితే డెలివరీ బాయ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. డెలివరీ బాయ్ కు బైక్, లైసెన్స్ తో పాటు ఆర్‌సీ, వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏవి లేకపోయినా ఈ ఉద్యోగాలకు ఎంపిక కారు. వీటితో పాటు స్మార్ట్ ఫోన్ ను తప్పనిసరిగా కలిగి ఉండటంతో పాటు ఉత్పత్తులను డెలివరీ చేసే ప్రాంతంపై సరైన అవగాహన ఉండాలి.