ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త…?

మన నిత్య జీవితంలో ఇతర కార్డులతో పోలిస్తే ఆధార్ కార్డుకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు తాజాగా యూఐడీఏఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నంబర్ ఉంటే మాత్రమే కార్డును డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉండేది. ప్రస్తుతం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే మాత్రమే సరైన వివరాలను నమోదు చేసి ఆధార్ కార్డును పొందగలిగే ఛాన్స్ ఉండేది. అయితే […]

Written By: Navya, Updated On : November 15, 2020 6:27 pm
Follow us on


మన నిత్య జీవితంలో ఇతర కార్డులతో పోలిస్తే ఆధార్ కార్డుకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు తాజాగా యూఐడీఏఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతంలో ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నంబర్ ఉంటే మాత్రమే కార్డును డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉండేది. ప్రస్తుతం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే మాత్రమే సరైన వివరాలను నమోదు చేసి ఆధార్ కార్డును పొందగలిగే ఛాన్స్ ఉండేది.

అయితే మొబైల్ నంబర్ లేకపోయినా ఆధార్ కార్డును పొందే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. కొన్ని రోజుల క్రితం యూఐడీఏఐ పాలివినైల్ క్లోరైడ్ కార్డులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పాలి వినైల్ క్లోరైడ్ కార్డులు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పాన్ కార్డులను పోలి ఉంటాయి. పాలివినైల్ కార్డులను సులువుగా పర్సులో ఇమిడిపోగలవు కాబట్టి వీటిని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్లవచ్చు.

పీవీసీ ఆధార్ కార్డుల ద్వారా మరో ప్రయోజనం ఏమిటంటే ఈ కార్డుకు లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ ఆధార్ కార్డులు వాలెట్ లో సైతం సులువుగా ఇమిడిపోతాయి కాబట్టి ఆధార్ కార్డ్ అవసరమైన చోట్ల ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సంవత్సరాల పాటు మన్నిక వచ్చేలా ఈ కార్డులను రూపొందించారు. ఈ కార్డును పొందాలంటే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ఉంటుంది.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేని వాళ్లు కూడా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తూ ఉండటంతో మనతో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను కూడా సులభంగా డౌన్ లోడ్ చేసే అవకాశం ఉంటుంది. https://residentpvc.uidai.gov.in/order-pvcreprint ద్వారా పీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.