https://oktelugu.com/

75 ఏళ్ళ వృద్ధుడిని అందలమెక్కించిన జగన్

తన అభిమతానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ వాయిదా వేసినప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన హోదాను సహితం మరచిపోయి స్పందించి తీరు చూస్తే రమేష్ కుమార్ ను పదవిలో ఉండనీయరని అందరికి తెలిసి పోయింది. అప్పటి నుండే న్యాయ నిపుణులతో అందుకు గల మార్గాల గురించి ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా పలు […]

Written By: , Updated On : April 11, 2020 / 02:15 PM IST
Follow us on


తన అభిమతానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ వాయిదా వేసినప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన హోదాను సహితం మరచిపోయి స్పందించి తీరు చూస్తే రమేష్ కుమార్ ను పదవిలో ఉండనీయరని అందరికి తెలిసి పోయింది.

అప్పటి నుండే న్యాయ నిపుణులతో అందుకు గల మార్గాల గురించి ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా పలు మార్గాలను అన్వేషించారు. వాటిల్లో ఒకటి శాసన సభలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలిచించడం. చివరకు పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్సు తీసుకు రావడం ద్వారా తిలగించేందుకు సిద్ధపడ్డారు.

ఇంతవరకు ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఐ ఎ ఎస్ గా ఉద్యోగ విరమణ చేసిన వారిని కాకుండా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఎందుకు చట్టంలో మార్పు తీసుకు వచ్చారో మాత్రం మంత్రులకు కూడా అర్ధం కాలేదు. ఈ విషమై ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు.

అయితే ఆ పదవికి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ (75)ను ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతున్నది. పొరుగు రాష్ట్రాల నుండి కూడా వెతికి తీసుకు వచ్చి అటువంటి వారిని చాలామందిని అందలం ఎక్కించడం మనం చూస్తూనే ఉన్నాం.

పైగా, ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన ఐ ఎ ఎస్ లను వెంటనే నియమించడం జరుగుతున్నది. అంటే సుమారు 60 సంవత్సరాల వయస్సు గలవారిని నియమిస్తున్నారు. కానీ తొలిసారిగా 75 ఏళ్ళ వృద్ధుడిని నియమించారు.

కనగరాజ్ దాదాపు 9 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు. ఈయన విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే.