ఫిజియోథెరపిస్ట్ కు కరోనా ఆందోళనలో స్థానికులు

అనంతపురం జిల్లాలో ఒక ఫిజియోథెరఫిస్ట్ కు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారణ కావడంతో అతని వద్ద ఫిజియోతెరఫీ చేయించుకున్న వారంతా ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని హిందూపురం పట్టణంలో ఆర్.పి.జి.టి రోడ్డులోని తేజా నర్సింగ్ హోమ్, బాలాజీ నర్సింగ్ హోమ్ లకు సమీపంలో ఒక వ్యక్తి కొంతకాలంగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తొలుత అతని తండ్రికి కివిడ్-19 వ్యాధి సోకింది. దీంతో కుమారుడైన ఫిజియోథెరఫిస్ట్ స్వాబ్ నమూనాను పరీక్షకు […]

Written By: Neelambaram, Updated On : April 11, 2020 2:12 pm
Follow us on


అనంతపురం జిల్లాలో ఒక ఫిజియోథెరఫిస్ట్ కు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారణ కావడంతో అతని వద్ద ఫిజియోతెరఫీ చేయించుకున్న వారంతా ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని హిందూపురం పట్టణంలో ఆర్.పి.జి.టి రోడ్డులోని తేజా నర్సింగ్ హోమ్, బాలాజీ నర్సింగ్ హోమ్ లకు సమీపంలో ఒక వ్యక్తి కొంతకాలంగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తొలుత అతని తండ్రికి కివిడ్-19 వ్యాధి సోకింది. దీంతో కుమారుడైన ఫిజియోథెరఫిస్ట్ స్వాబ్ నమూనాను పరీక్షకు పంపగా అతనికి కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. భాధితుణ్ని క్వారంటైన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు మార్చి 12 నుంచి 31 వరకు సంబంధిత ఫిజియోథెరఫీ సెంటర్ లో చికిత్స పొందిన వ్యక్తులు వారి సమాచారాన్ని పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బందికి తెలియజేయాలని కోరుతూ పలుచోట్ల నోటీసులు అంటించారు. హిందూపురం, లేపాక్షి, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం మడకశిర, కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు చెందిన వారు చికిత్స పొందిన వారిలో ఉన్నారని తెలుస్తోంది.