https://oktelugu.com/

అమెరికాలో 40 మందికి పైగా భారతీయుల మృతి

కరోనా మహమ్మరి కారణంగా అమెరికాలో ఇప్పటికే 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు. 1500 మందికి పైగా భారతీయులకు కరోనా సోకింది. దీంతో ప్రవాస భారతీయులలో భయం నెలకొంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ లలో కరోనా ప్రభావం ఆందోళనకరంగా ఉంది. ఇక్కడే భారతీయులు కూడా ఎక్కువగా ఉన్నారు. కేరళకు చెందిన వారు 17 మంది కరోనాతో మృతి చెందారు. గుజరాత్ కు చెందిన 10 మంది, పంజాబ్ నుంచి 4, ఏపీ నుంచి 2, ఒడిశాకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 11, 2020 / 02:26 PM IST
    Follow us on


    కరోనా మహమ్మరి కారణంగా అమెరికాలో ఇప్పటికే 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు. 1500 మందికి పైగా భారతీయులకు కరోనా సోకింది. దీంతో ప్రవాస భారతీయులలో భయం నెలకొంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ లలో కరోనా ప్రభావం ఆందోళనకరంగా ఉంది. ఇక్కడే భారతీయులు కూడా ఎక్కువగా ఉన్నారు.

    కేరళకు చెందిన వారు 17 మంది కరోనాతో మృతి చెందారు. గుజరాత్ కు చెందిన 10 మంది, పంజాబ్ నుంచి 4, ఏపీ నుంచి 2, ఒడిశాకు చెందిన ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్కరు మినహా మిగతా వారంతా 60 ఏళ్లకు పై బడిన వారే. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు.

    న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో భారతీయులు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. కరోనా తో చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అంత్యక్రియలకు 10 మందికి మించి అక్కడి ప్రభుత్వం అనుమతించటం లేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, భారత్ లోని బంధువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

    న్యూ యార్క్, న్యూ జెర్సీలోనే 30 మంది వరకు భారతీయులు చనిపోయారు. బాధితులకు ట్రీట్ మెంట్ కోసం అమెరికాలోని భారతీయ సమాజ నేతలు, ప్లాస్మా డోనర్స్ కోసం సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్లాస్మా ట్రీట్ మెంట్ కరోనా నివారణకు ఉపయోగపడుతూ ఉండటంతో మన వారిని రక్షించేందుకు అక్కడి భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు.