https://oktelugu.com/

రాజకీయాల్లోకి రాను.. రజినీకాంత్ సంచలన ప్రకటన.. కారణం ఇదే!

సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న పార్టీ, గుర్తు ప్రకటిస్తారని చెప్పిన రజినీకాంత్ తాజాగా తాను రాజకీయాలకు రావాలనుకోవడం లేదని.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ప్రారంభించడం లేదని మూడుపేజీల సుధీర్ఘ లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. Also Read: భారత్ లో కొత్త కరోనా కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే? అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం లేదని రజినీకాంత్ తెల్చిచెప్పారు. తానిచ్చిన మాటను వెనక్కి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2020 1:09 pm
    Follow us on

    Rajinikanth

    సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న పార్టీ, గుర్తు ప్రకటిస్తారని చెప్పిన రజినీకాంత్ తాజాగా తాను రాజకీయాలకు రావాలనుకోవడం లేదని.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ప్రారంభించడం లేదని మూడుపేజీల సుధీర్ఘ లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

    Also Read: భారత్ లో కొత్త కరోనా కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?

    అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం లేదని రజినీకాంత్ తెల్చిచెప్పారు. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరాడు. రాజకీయ ప్రకటనకు ముందు తాను ఆస్పత్రిలో చేరడం అనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు రజినీకాంత్ చేసిన ప్రకటన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

    తమిళ సూపర్‌‌ స్టార్‌‌. ఎన్నో విభిన్న పాత్రలు.. మరెన్నో విభిన్న కథనాలతో సినిమాలు తీసిన విలక్షణ నటుడు. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. కానీ.. ఇంతలోనే ఆయన్ను అనారోగ్య సమస్యలు వెంటాడాయి. దీంతో ఆయనపై కుటుంబసభ్యుల ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయాలు మనకు వద్దని ఆయన కుమార్తెలిద్దరూ రజనీకాంత్‌పై ఒత్తిడి తెస్తున్నట్లుగా తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.

    కుమార్తెల విజ్ఞప్తిపై రజనీకాంత్ ఎలాంటి స్పందన వ్యక్తం చేశారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. కుటుంబసభ్యులు ఆరోగ్యమే ప్రధానమని.. రాజకీయాలు వద్దని చెబుతుండడంతో రజనీ మనస్ఫూర్తిగా పార్టీపై దృష్టి పెట్టగలరా అన్న చర్చ నడుస్తోంది. రజనీకాంత్‌ వయసు ఇప్పుడు 70 ఏళ్లు. మామూలుగా రాజకీయాల్లో ఉన్న వారికైనా ఆ వయసు వస్తే రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. అంతకుముందు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న వారు.. ఆ వయసుకు కొనసాగగలుగుతారేమోకానీ… 70 ఏళ్ల వయసులో ఏంట్రీ ఇచ్చి సక్సెస్ కావడం అంత ఈజీ కాదు.

    Also Read: కమలంతో పొత్తుకు చంద్రబాబు ఆరాటం

    పైగా న్యూ ఏజ్ పాలిటిక్స్‌ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వ్యూహాలు రాజకీయాలన్నీ ప్రజల కోణంలో కాకుండా.. కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగా చేయాల్సి ఉంటుంది. పాత తరం ఆలోచనలు ఉన్న వారికి ఇలాంటివి పెద్దగా పట్టవు. మన స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకన్న భావనలో ఉంటారు. రజనీకాంత్ కూడా తన రాజకీయ లక్ష్యం కోసం.. అలాంటి రాజకీయాలు చేయాలన్న ఆలోచన చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే రజనీకాంత్.. రాజకీయాల్లో సక్సెస్ కాలేరన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

    ప్రస్తుతం వైద్యులు మానసికంగా కూడా బలంగా ఉండాలని.. ఒత్తిడికి గురికాకూడదని రజానీకాంత్‌కు సలహా ఇచ్చారు. అయితే.. రాజకీయం అంటేనే మానసికంగా ఎంతో ఒత్తిడి. అపోజిషన్‌ వారు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా విమర్శలు చేస్తుంటుంది. వ్యక్తిగతంగా విమర్శలకూ దిగుతుంటారు. వాటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించగలగాలి. ఏ మాత్రం పరిగణనలోకి తీసుకున్నా మానసికంగా ఇబ్బంది పడతారు. అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే.. రజనీ కుమార్తెలు రాజకీయంగా కన్నా ఆయన ఆరోగ్యంగా తమతో ఉంటే చాలని అనుకుంటున్నారు. దీంతో రజనీకాంత్ తాజాగా తాను రాజకీయాల్లోకి రానని.. తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు.