టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల సందర్భంగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని చెప్పారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే ధీమా వ్యక్తం చేశారు.
Also Read: మహేష్ బాబు కోసం నలుగురి మధ్య పోటీ !
ఇదివరకు చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షల్లో లోపాల వల్ల చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. రెండు రోజుల్లోనే ఆయన క్వారంటైన్ నుంచి బయటికి వచ్చారు. తాజాగా అలాంటి ఫలితమే రామ్‌చరణ్ విషయంలోనూ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా-.. తాను ఆరోగ్యంగా ఉన్నానని రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఙప్తి చేశారు.
ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రామ్‌చరణ్.. రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉంది. తాజాగా ఆయన కరోనా బారిన పడటం వల్ల సినిమా యూనిట్‌లో కలకలం రేపుతోంది. యూనిట్ సభ్యులు, తోటి నటీనటులు, టెక్నీషియన్లు కరోనా వైరస్ బారిన పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనే వారు ప్రతీరోజూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రామ్‌చరణ్ రోజూ టెస్ట్‌లను చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ను చేయించుకోగా కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. షూటింగ్ సందర్భంగా ఆయనకు కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Also Read: అఖిల్ కనిపించడే..?
అయితే.. క్రిస్మస్ సందర్భంగా రామ్ చరణ్ తన ఇంటికి మెగా ఫ్యామిలీని మొత్తం ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో సంతోషంగా గడిపారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న వారందరూ చరణ్‌కు సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగారు. ఇప్పుడు చరణ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మిగతా వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న వారిలో అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, నిహారిక, చైతన్య, శ్రీజ, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వీళ్లంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందే. అంతేకాదు.. ఇటీవల ‘ఆచార్య’ సెట్‌లోనూ అడుగుపెట్టాడు చరణ్. చాలా సేపు సెట్‌లోనే ఉన్నాడు. కొరటాల శివతో.. కొంత సమయం గడిపాడు. ఇప్పుడు ఆయనా.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్