https://oktelugu.com/

ఇక ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ , రోడ్డు ట్యాక్స్ కట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం తగ్గించే దిశంగా గొప్ప ముందడుగు వేసింది. కాలుష్యం తగ్గించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గించేందుకు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపడుతోంది. కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పెట్రోల్, డీజీల్ తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు అద్భుతమైన ఆఫర్ ను […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 08:44 AM IST
    Follow us on

    తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం తగ్గించే దిశంగా గొప్ప ముందడుగు వేసింది. కాలుష్యం తగ్గించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గించేందుకు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపడుతోంది. కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణలో పెట్రోల్, డీజీల్ తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది.

    తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు ట్యాక్స్ గానీ కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

    ఆ ఉత్తర్వులు ప్రకారం.. తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 100శాతం రోడ్ ట్యాక్స్ ఫ్రీతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలకు ఈ ఆఫర్ వర్తించనుంది.

    తొలి 20వేల మూడు చక్రాల వాహనాలు, తొలి 10వేల ఎలక్ట్రిక్ లైట్ గూడ్సూ్ క్యారియర్ వాహనాలు, తొలి 5వేల కార్లు, 5వేల ఫోర్ వీలర్ వాహనాలకు ఉచిత రోడ్డు ట్యాక్స్ , ఫ్రీ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించింది.