మెగా వారసుడు ‘వైష్ణవ్ తేజ్ ’ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ కరోనాకు ముందే రెడీ అయినా ఈ మూవీని ఓటీటీకి ఇవ్వకుండా థియేటర్లో రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు ఆగారు. ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.
వైష్ణవ్, కృతి ఇరగదీసిన ఈ మూవీకి సుకుమార్ కథ సహకారం అందిస్తున్నారు. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఈ సినిమాకు డైరెక్టర్. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఉప్పెన మూవీ నుంచి వచ్చిన మూడు పాటలు మంచి హిట్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఎందుకో గానీ సుకుమార్ సినిమా అనగానే ఇండస్ట్రీ హిట్ ఇచ్చే పాటలు ఇస్తాడు.
తాజాగా ఉప్పెన సినిమాను ఊపేసే పాటలు ఇచ్చాడు. తాజాగా ఉప్పెనలో మరో అదిరిపోయే పాట ఉందన్న విషయం తెలిసింది. ‘శివుడి’ పాట ఇందులో అద్భుంతా ఉందని.. ఇది థియేటర్స్ లో చూస్తే గూస్ బంబ్స్ అని అంటున్నారు.
శివుడి మీద మాంచి పవర్ ఫుల్ తత్వగీతం లాంటి పాటను దేవీ కట్టాడట.. చంద్రబోస్ రాసిన ఈ పాట సినిమాలో మాంటేజ్ సాంగ్ గా వస్తుందట.. ఇది అద్భుతమని అంటున్నారు. మరి సినిమా విడుదలకు ముందే పాటను రిలీజ్ చేస్తారట.. చూడాలి మరీ ఆ సాంగ్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేస్తుందో..