వైరల్: సన్ రైజర్స్ కు అండగా ‘గచ్చిబౌలి దివాకర్’ రె‘ఢీ’!

సంప్రదాయ మీడియాకు పూర్తి విరుద్ధంగా ముక్కుసూటిగా.. సెటైర్లతో ఉన్న వాస్తవాలను చెప్పేందుకైనా.. ఎవరిపైనా అయినా పంచులు పేల్చేందుకు ఇప్పుడు అందరికీ ‘సోషల్ మీడియా’ ఒక ఆయుధంగా కనిపిస్తోంది. ఏ సెలెబ్రెటీ తప్పు చేసినా కూడా మీమ్స్, ట్రోల్స్ తో ఉతికి ఆరేసేలా సోషల్ మీడియాలో నెటిజన్లు రెడీగా ఉంటున్నారు. ఈ సంప్రదాయం కేవలం సగటు వ్యక్తులకే కాదు.. దిగ్గజ సంస్థలు, సెలెబ్రెటీలు, ఇతర ప్రముఖులకు కూడా ఉంది.తాజాగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్విట్టర్ లో […]

Written By: NARESH, Updated On : February 4, 2021 9:03 am
Follow us on

సంప్రదాయ మీడియాకు పూర్తి విరుద్ధంగా ముక్కుసూటిగా.. సెటైర్లతో ఉన్న వాస్తవాలను చెప్పేందుకైనా.. ఎవరిపైనా అయినా పంచులు పేల్చేందుకు ఇప్పుడు అందరికీ ‘సోషల్ మీడియా’ ఒక ఆయుధంగా కనిపిస్తోంది. ఏ సెలెబ్రెటీ తప్పు చేసినా కూడా మీమ్స్, ట్రోల్స్ తో ఉతికి ఆరేసేలా సోషల్ మీడియాలో నెటిజన్లు రెడీగా ఉంటున్నారు.

ఈ సంప్రదాయం కేవలం సగటు వ్యక్తులకే కాదు.. దిగ్గజ సంస్థలు, సెలెబ్రెటీలు, ఇతర ప్రముఖులకు కూడా ఉంది.తాజాగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. బ్రహ్మానందంతో వదిలిన మీమ్ అందరికి నవ్వులు తెప్పిస్తోంది.

తాజాగా ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 కోసం మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ వేలంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా దిగ్గజ ఆటగాళ్లను వదిలేసుకుంది. ఈ వేలంలో పెద్ద ఆటగాళ్లను కొనేందుకు రాజస్థాన్ వద్ద భారీగా డబ్బులు ఉన్నాయి. అందుకే తాజాగా రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ‘ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటలో ఉన్న కొందరు టాప్ క్రికెటర్లు వీరే.. మీకెవరు కావాలి ’ అని క్రికెటర్లు, సినిమాల్లోని హీరోల ఫొటోలను షేర్ చేసింది.

దీనికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫన్నీగా స్పందించింది. ఈ ట్వీట్ కు రిప్లైగా మన బ్రహ్మానందం నటించిన ‘కొంచెం ఇష్టం.. కొంచె కష్టం’ సినిమాలోని క్రికెట్ ఆడుతోన్న జిఫ్ ఫైల్ ను పోస్ట్ చేసింది. ‘మేం క్రికెటర్ ను ఇప్పటికే ఎన్నుకున్నం’ అంటూ కామెంట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ‘గచ్చిబౌలి దివాకర్’ అనే పాత్రలో క్రికెటర్ గా కామెడీ పండించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.

https://twitter.com/SunRisers/status/1356851592171937794?s=20