నితిన్ దూకుడు.. మరో సినిమా రిలీజ్ డేట్

యువ హీరో నితిన్ జోరు మీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించేస్తున్నాడు. అతడి జోరు చూస్తుంటే ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు! ఇప్పటికే హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే వారం థియేటర్లలోకి రాబోతోంది. ఆ తర్వాత ‘రంగ్ దే’ కూడా రిలీజ్ కు రెడీ […]

Written By: NARESH, Updated On : February 20, 2021 1:44 pm
Follow us on

యువ హీరో నితిన్ జోరు మీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించేస్తున్నాడు. అతడి జోరు చూస్తుంటే ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.

Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు!

ఇప్పటికే హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే వారం థియేటర్లలోకి రాబోతోంది. ఆ తర్వాత ‘రంగ్ దే’ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. మార్చి నెలాఖర్లో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వీటికి అదనంగా మరో సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించి సంచలనం సృష్టించాడు నితిన్.

జూన్ 11న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు నితిన్ ప్రకటించారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధూన్ సినిమాకు రిమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా విడుదల తేదిని ముందే ప్రకటించి ఖర్చీఫ్ వేశాడు.

Also Read: ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!

హిందీలో ‘అంధ కీబోర్డ్ ప్లేయర్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురనా అద్భుతంగా నటించాడు. ఈ పాత్రను నితిన్ పోషిస్తున్నాడు. రాధిక ఆప్టే పాత్రలో నభా నటేష్ కనిపించనున్నారు. నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ కు పెట్టి నితిన్ జోరు పెంచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్