https://oktelugu.com/

Robin Hood Song: దుమారం రేపుతున్న నితిన్ ‘రాబిన్ హుడ్’ లేటెస్ట్ సాంగ్..హీరోయిన్ బట్టలు లేకుండా ఇలా డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి!

ముఖ్యంగా టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్(Shekar Master), ఈమధ్య కాలంలో సినిమా సినిమాకి తన హద్దులను దాటేస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటలకు ఆయన కొరియోగ్రఫీ ఎలాంటి విమర్శలు అందుకుందో మనమంతా చూసాము.

Written By: , Updated On : March 11, 2025 / 10:35 AM IST
Robin Hood Song

Robin Hood Song

Follow us on

Robin Hood Song: ఈమధ్య కాలంలో కొంతమంది డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ హీరోయిన్స్ ని ఎంత నీచంగా చూపించాలో, అంత నీచంగా చూపిస్తున్నారు. వాళ్ళు చూపించే విధానం పై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి కంటెంట్ కి యూట్యూబ్ మరియు ఇతర ఓటీటీ యాప్స్ లో యూత్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, వీటికి సెన్సార్ అనేది లేకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్(Shekar Master), ఈమధ్య కాలంలో సినిమా సినిమాకి తన హద్దులను దాటేస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటలకు ఆయన కొరియోగ్రఫీ ఎలాంటి విమర్శలు అందుకుందో మనమంతా చూసాము. కానీ యూట్యూబ్ లో ఆ పాటలను మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అదే విధంగా ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం లోని ‘దబిడి దిబిడి'(Dabidi Dibidi) పాటకు కూడా సోషల్ మీడియా లో ఎలాంటి విమర్శలు వచ్చాయో మనమంతా గమనించాము.

Also Read: రియల్ లైఫ్ లో నటి ప్రగతి ఎలా ఉంటుంది? ఎఫ్ 3 నటుడు బయటపెట్టిన నిజాలు!

కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తుంది. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ సైతం, ఆ పాటలో అసభ్యంగా అనిపించే హుక్ స్టెప్ ని అనుసరిస్తూ డ్యాన్స్ వేస్తున్నారు. ‘పుష్ప 2′(Pushpa 2 Movie) లోని ‘పీలింగ్స్'(Peelings Song) పాటకు కూడా ఇదే తరహా రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు దాని రీచ్ ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ పాటల తరహాలోనే నిన్న విడుదలైన నితిన్(Actor Nithin) ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) లోని ‘అది దా సర్ప్రైజ్'(Adhi Dha Surprise) పాట నిలవనుంది. నిన్న విడుదలైన ఈ పాటకు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. ప్రముఖ యంగ్ హీరోయిన్ కేతిక శర్మ(Kethika Sharma) ని చాలా హాట్ గా ఈ పాటలో చూపించారు. అయితే ఈ పాట ఆరంభంలో ఆమె జాకెట్ వేసుకోలేదు, కనీసం చిన్న గుడ్డ పోగు కూడా కప్పుకోలేదు. కేవలం మల్లెపూలని జాకెట్ గా వేసుకొని, శరీరం మొత్తం ఆయిల్ పూసుకొని డ్యాన్స్ వేసింది.

ఇలాంటివి యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది కానీ, మిగిలిన వాళ్లకు ఎటు పోతుంది ఈ సమాజం అని అనుకోక తప్పదు. మల్లెపూలు జాకెట్ లాగా వాడుకోవడం ఏమిటి?, చూస్తుంటే శేఖర్ మాస్టర్ తన తదుపరి చిత్రం లో హీరోయిన్ ని పూర్తిగా బట్టలు విప్పించి డ్యాన్స్ వేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విమర్శలు చేస్తున్నరు నెటిజెన్స్. ఇకపోతే రాబిన్ హుడ్ చిత్రం లో ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి. మొదటి రెండు పాటలకు రెస్పాన్స్ అసలు రాలేదు కానీ, నిన్న విడుదలైన పాటకు మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. కేతిక వర్మ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేసింది కానీ, శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీ స్టైల్ ని మార్చకపోతే ఇక అస్సాం ట్రైన్ ఎక్కడం గ్యారంటీ అనిపిస్తుంది. కేవలం ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోడానికి అనుగుణంగానే ఆయన స్టెప్పులను కంపోజ్ చేస్తున్నాడు. ఇది ఎదో ఒకరోజు మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

Adhi Dha Surprisu Lyric | Robinhood | Nithiin, Sreeleela, Ketika Sharma, Venky Kudumula, GV Prakash